హీరోయిన్ కీర్తి సురేష్... రాజకీయాల్లోకి అడుగుపెడుతోందా? బీజేపీలో ఆమె తన బెర్త్ కూడా ఖరారు చేసుకుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మళయాళంలో కీర్తిసురేష్ చాలా బిజీగా గడుపుతోంది.  ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే... మహానటి సినిమాతో ఆమె క్రేజ్ బాగా పెరిగింది. ఈ క్రేజ్ ని పొలిటికల్ గా వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటీవల భేటీ అయ్యినట్లు సమాచారం. ఇక ఇప్పటికే కీర్తీసురేశ్‌ బీజేపీ తరఫున ప్రచారం కూడా చేసిందనే టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇన్ని విషయాలు వైరల్‌ అవుతున్నా  కీర్తీసురేశ్‌ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది.

అయితే ఆమె తల్లి మేనకా సురేశ్‌ మాత్రం స్పందించక తప్పలేదు. ఈ వ్యవహారం గురించి ఆమె తెలుపుతూ తన భర్త భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. అయితే తాను గానీ, కీర్తీసురేశ్‌ గానీ ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదన్నారు. అయితే కీర్తీసురేశ్‌ బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం మాత్రం వాస్తవేమని చెప్పారు. అది తన భర్త పార్టీ కావడంతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తానూ, కీర్తీసురేశ్‌ ఢిల్లీలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసినట్లు వివరించారు.