Asianet News TeluguAsianet News Telugu

నటి, బీజేపీ నేత సోనాలిది హత్యే.. కీలక మలుపు తిప్పిన పోస్టుమార్టం నివేదిక, ఇద్దరు అరెస్ట్..

సంచలనం సృష్టించిన బీజేపీ నేత, నటి సోనాలి ఫొగాట్ ది హత్యేనని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఇది తేలింది. దీంతో ఆమె సహాయకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

Actress and BJP leader Sonali was murdered, Postmortem report which turned a key point, two arrested
Author
First Published Aug 26, 2022, 8:40 AM IST

పనాజీ :  గోవా పర్యటనలో రెండు రోజుల కిందట ఆకస్మిక మరణానికి గురైన టిక్ టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగాట్ (42) కేసును పోస్టుమార్టం నివేదిక కీలక మలుపు తిప్పింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తేలడంతో హత్యకేసుగా నమోదు చేసిన గోవా పోలీసులు..  సోనాలీ  సహాయకులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు.  నిందితులు సుధీర్ సాగవాన్, సుఖ్వీందర్ వాసి… ఇద్దరూ ఆమె ఈ నెల 22న గోవాకు వచ్చినప్పుడు వెంటనే ఉన్నారు.  పోలీసులు మొదట దీన్ని గుండెపోటు మరణంగా భావించారు.

సోనాలి సోదరుడైన రింకు ఢాకా తన సోదరి సహాయకులు ఇద్దరిపై అనుమానంగా ఉందని గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ దరిమిలా గురువారం ఉదయం వచ్చిన పోస్టుమార్టం నివేదిక సైతం ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు తేల్చింది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన సోనాలీ ఫోగాట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

బీజేపీ నేత సోనాలీ ఫోగట్‌ను హత్య చేశారు.. పోలీసులకు సోదరుడి ఫిర్యాదు

ఇదిలా ఉండగా, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ బిజెపి నేత నటి సోనాలి ఫోగాట్ గుండెపోటుతో మరణించినట్లు మంగళవారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె మరణం బిజెపిలో కొంత చర్చను లేవదీసింది. అయితే  బుధవారం ఆగస్ట్ 24న సోనాలి ఫోగాట్ గురించి ఆమె సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోనాలి ఫోగాట్ గుండెపోటుతో మరణించాడాన్ని ఆయన నమ్మలేదు. ఆమె హత్యకు గురైందని సంచలన ఆరోపణలు చేశారు. సోనాలి ఫోగాట్  సోదరుడు రింకు ధాకా గోవా పోలీసులకు ఈ విషయం మీద ఫిర్యాదు చేశాడు.

సోనాలి ఫోగాట్ మరణానికి ముందు కూడా, ఆమె ఆమె తన తల్లి, సోదరి,బావలతో మాట్లాడిందని వివరించాడు. తన ఇద్దరు సహాయకులపై ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ఇద్దరిపై అయితే ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బహుశా ఆ ఇద్దరే తన సోదరి సోనాలి ఫోగాట్ ను చంపేసి ఉండొచ్చని ఆరోపణలు చేశారు. హర్యానాలోని ఆమె ఫామ్హౌస్ నుంచి ఉన్నట్టుండి సీసీ టీవీ కెమెరాలు, ల్యాప్టాప్, ఇతర కీలకమైన సాక్ష్యాధారాలు కనిపించకుండా పోయాయని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios