Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేత సోనాలీ ఫోగట్‌ను హత్య చేశారు.. పోలీసులకు సోదరుడి ఫిర్యాదు

బీజేపీ నేత సోనాలీ ఫోగట్ గుండెపోటుతో మరణించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడు మాత్రం ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

my sister sonali phogat get killed brother alleges complaints goa police
Author
First Published Aug 24, 2022, 4:30 PM IST

పనాజీ: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మరణించినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె మరణం బీజేపీలో కొంత చర్చను లేవదీసింది. అయితే, తాజాగా, ఫోగట్ గురించి ఆమె సోదరుడు సంచలన వ్యాఖ్యలు  చేశారు. సోనాలి ఫోగట్‌ గుండెపోటుతో మరణించడాన్ని ఆయన విశ్వసించలేదు. కానీ, ఆమె హత్యకు గురైందని సంచలన ఆరోపణలు చేశారు.

ఫోగట్ సోదరుడు రింకు ధాకా గోవా పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. సోనాలి ఫోగట్ మరణానికి ముందు కూడా ఆమె తమ తల్లి, సోదరి, బావలతో మాట్లాడిందనని వివరించారు. తన ఇద్దరు కొలీగ్‌ల పై ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ఇద్దరు కొలీగ్‌ల పై ఆమె తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బహుశా  ఆ ఇద్దరే తన సోదరి సోనాలి ఫోగట్‌ను చంపేసి ఉండొచ్చని ఆరోపణలు చేశారు.

హర్యానాలోని ఆమె ఫామ్ హౌజ్ నుంచి ఉన్నట్టుండి సీసీటీవీ కెమెరాలు, ల్యాప్‌టాప్, ఇతర కీకలమైన సాక్ష్యాధారాలు కనిపించకుండా పోయాని అన్నారు. 

42 ఏళ్లు బతికిన  సోనాలి ఫోగట్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆమెను ఉత్తర  గోవాలో అంజునాలోని సెయింట్ ఆంథోనీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె హార్ట్ ఎటాక్‌తో మరణించినట్టు పోలీసులు అనుమానించారు. 

అంజునా పోలీసులు అయితే, ఆమెది అసహజ మరణంగా రిపోర్ట్ చేసుకున్నారు.

మంగళవారం రాత్రి సోనాలి ఫోగట్ కుటుంబం గోవాకు వచ్చింది. సోనాలి ఫోగట్‌ ఇద్దరు సన్నిహితులు గోవాలనే హత్యకు గురయ్యారని ఆయన సోదరుడు దాకా పోలీసులకు వివరించారు.

తాము వారి నుంచి దూరంగా ఉండాలని కోరామని, వెంటనే తర్వాతి రోజే హిసార్ తిరిగి రావాలని చెప్పామని ఆయన అంజునా పోలీసు స్టేషన్ వెలుపల విలేకరులకు చెప్పారు.

కాగా, ఆ ఇద్దరిపై తాను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని వివరించారు. ఒక వేళ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు కాకుంటే తమ సోదరి సోనాలి ఫోగట్ మృతదేహానికి ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పోస్టుమార్టం ఢిల్లీలోని ఎయిమ్స్ లేదా జైపూర్ లోని ఎయిమ్స్‌లో చేయాలని ఫోగట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

తమ సోదరి 15 ఏళ్లుగా బీజేపీ నేతగా కొనసాగారని ఆయన తెలిపారు. తమకు న్యాయం జరగాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తామని అన్నారు.

సోనాలి ఫోగట్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె తన వద్ద పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కలిసి గోవా వెళ్లింది. అయితే సోమవారం రాత్రి అసౌకర్యంగా ఉన్నట్టుగా చెప్పడంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందరు. అయితే ఇందుకు కొన్ని గంటల ముందు కూడా సోనాలి ఫోగట్ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోనాలి ఫోగట్ మృతిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విచారం వ్యక్తం చేశారు. ‘‘సోనాలి ఫోగట్ మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను’’ అని ట్వీట్ చేశారు. 

ఇక, సోనాలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. కుల్దీప్ బిష్ణోయ్  గత నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక, సోనాలి ఫోగట్‌కు కుమార్తె యశోధర ఫోగట్ ఉంది. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ 2016లో 42 ఏళ్ల వయసులో వారి ఫామ్‌హౌస్‌లో మరణించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios