ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్ట్ అయిన ఈ 81 సంవత్సరాల వీవీ ఆరోగ్యు పరిస్థితి క్షీణిస్తుండడంతో ముంబైలోని  జేజే ఆసుపత్రికి తరలించారు.

ఎట్టకేలకు విరసం నేత వరవరరావు ను ముంబై లోని జేజే ఆసుపత్రికి తరలించారు. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్ట్ అయిన ఈ 81 సంవత్సరాల వీవీ ఆరోగ్యు పరిస్థితి క్షీణిస్తుండడంతో ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. జేజే ఆసుపత్రి వర్గాలు కూడా వరవరరావు అడ్మిట్ అయినట్టు ధృవీకరించాయి. 

ఇప్పటికే రెండు సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్న వరరావు ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, జైలు అధికారులు ఈ సమాచారం తమకు తెలియకుండా దాచిపెడుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

మే28న జైల్లో అనారోగ్యంతో వరవరరావు పరిస్థితి ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆ తరువాత తిరిగి జైలుకు తరలించారు ఆయన కూతురు పవన మాట్లాడుతూ.... వరవరరావు ఆరోగ్యం నాటి నుండి క్షీణిస్తూనే ఉందని, ఆయన నిన్న ఫోన్ లో మాట్లాడలేకపోయారని, అంతా అసంబద్ధంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. 

ఆయన సహచరి హేమలత మాట్లాడుతూ... వరవరరావు నిన్న మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడలేకపోతుంటే.. ఆయన పక్క ఖైదీ ఆయన పరిస్థితిని వివరించారని అన్నారు. ఆయన పళ్ళు కూడా తోముకోలేకపోతున్నారని సహచరుడు వివరించినట్టుగా వీవీ కుటుంబసభ్యులు తెలిపారు. 

ఆయనకు వైద్యం అత్యవసరం అని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించడం అవసరమని జైలు లో సహా ఖైదీ చెప్పినట్టుగా హేమలత వివరించారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, అయినప్పటికీ... తమకు ఆరోగ్య పరిస్థితిని తెలియనీయకుండా జైలు అధికారులు దాస్తున్నారని ఆమె అన్నారు. 

ఈ విషయం తెలియగానే వరవరరావు తరుపు లాయర్ జైలు అధికారులకు ఒక ఇమెయిల్ ని పంపించాడు. వరవరరావు ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడంతోపాటుగా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. 

మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావును ఆస్పత్రికి పంపించి చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని ప్రొఫెసర్‌.హరగోపాల్‌ సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు.వరవరరావు కి సరైన చికిత్స అందించే ఏర్పాట్లు చేయడంతోపాటుగా బెయిల్ పై విడుదలయ్యేలా చూడాలని కేసీఆర్‌ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.