Asianet News TeluguAsianet News Telugu

వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట, బెయిల్ పొడగింపు...ఎప్పటివరకంటే...

వరవరరావు వేసిన పిటిషన్ పై విచారణను  వచ్చే నెలకు వాయిదా వేసింది. అనారోగ్య కారణాలతో Taloja Jailలో ఉన్న varavararaoకు బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది.

Activist Varavara Rao Need Not Surrender Till November 18
Author
Hyderabad, First Published Oct 27, 2021, 7:48 AM IST

ముంబై : ఎల్గార్‌ పరిషత్-మావోయిస్టులతో లింకు కేసులో మద్యంతర బెయిల్ పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. 

వరవరరావు వేసిన పిటిషన్ పై విచారణను  వచ్చే నెలకు వాయిదా వేసింది. అనారోగ్య కారణాలతో Taloja Jailలో ఉన్న varavararaoకు బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది.
 
Bail‌ పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్ పై Bombay High Court తాజా ఆదేశాలు జారీ చేసింది బెయిల్ పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

కాగా, అంతకుముందు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావుకు సెప్టెంబర్ 24 నాడు స్వల్ప ఊరట లభించింది. తన బెయిల్‌ పొడిగించాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. 

అక్టోబర్‌ 14 వరకు ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో వరవరరావుకు మరికొన్ని రోజులు ఉపశమనం కలిగినట్లు అయ్యింది.  

Elgar Council caseలో నిందితుడిగా ఉన్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి  తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైన ఆయన సెప్టెంబర్‌ 5న తిరిగి లొంగిపోవాలని సూచించింది. 

వివి బెయిల్ ను మరోసారి పొడిగించిన బాంబే హైకోర్టు.. కానీ...

తాజాగా ఆ గడువు ముగియడంతో తన బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఈ నెల మొదటి వారంలో వరవరరావు బాంబే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణను సెప్టెంబర్‌ 24 వాయిదా వేసింది. 

మరోసారి గడువు పూర్తి కావడంతో వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, జస్టిస్‌ ఎన్‌జే జమాదార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, సమయం తక్కువ ఉండడం వల్ల ఈ పిటిషన్‌ విచారణను అక్టోబర్‌ 14కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం.. అప్పటివరకూ లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అటు ఇదే వ్యవహారంలో కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.. ప్రస్తుతం వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నందున బెయిల్‌ పొడిగించకూడదని కోర్టుకు సూచించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios