జమ్మూ బస్టాండ్‌లో గురువారం ఉదయం ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు
జమ్మూ బస్టాండ్‌లో గురువారం ఉదయం ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన యాసిర్ భట్‌గా పోలీసులు గుర్తించారు.
గ్రెనేడ్ దాడి అనంతరం జమ్మూ నుంచి పారిపోతున్న యాసిర్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇవాళ ఉదయం 11.45 ప్రాంతంలో జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒకరు మరణించగా... 30 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే.
ఘటన విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం జమ్మూ బస్టాండ్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యక్ష సాక్షులతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో నిందితుడిని వేగంగా అదుపులోకి తీసుకోగలిగారు.
అరెస్టయిన వెంటనే యాసిర్ భట్ నేరాన్ని అంగీకరించాడు. కాగా, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని జమ్మూకశ్మీర్ డీజీపీ తెలిపారు.
Scroll to load tweet…
