అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళుతూ.. 12 మంది దుర్మరణం

accident in madhya pradesh
Highlights

అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళుతూ.. 12 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లనో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరేనా జిల్లాలో ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఓ జీపును ఢీకొట్టడంతో.. జీపులో ప్రయాణిస్తున్న 12 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి జీపు నుజ్జు నుజ్జు అయ్యింది. బాధితుల హాహాకారాలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అత్యంత కష్టం మీద జీపులోంచి బయటకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు గాయపడిన వారు ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీరంతా చనిపోయిన తమ బంధువు అంతిమ యాత్రలో పాల్గొనేందుకు గ్వాలియర్ వెళుతున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ‌లో అక్రమంగా ఇసుకను తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

loader