Asianet News TeluguAsianet News Telugu

నా తప్పును అంగీకరిస్తున్న.. ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతాను : అధిర్ రంజన్ చౌదరి

తన తప్పుని అంగీకరిస్తున్నానని, తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతానని లోక సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. తాను బెంగాలీ అని తనకు సరిగా హిందీ పలకడం రాదని చెప్పారు.

Accepting my mistake.. I apologize for the remarks of 'Rashtrapatni': Adhir Ranjan Chaudhary
Author
New Delhi, First Published Jul 28, 2022, 4:29 PM IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు. కానీ ఈ 'పఖండీలకు' (కపటవాదులకు) క్షమాపణ చెప్పబోనని ఆయ‌న‌ను విమ‌ర్శించేవారిని ఉద్దేశించి అన్నారు. 

Viral Video: త‌ర‌గతి గ‌దిలో విద్యార్థుల‌తో మ‌సాజ్ చేయించుకున్న టీచ‌ర‌మ్మ‌.. వీడియో వైర‌ల్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'రాష్ట్రపత్ని' అని లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్న తర్వాత బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కాంగ్రెస్ భారతదేశంలోని మహిళలు, గిరిజనులను కించపరిచింది అని పేర్కొంది. ‘‘ ఒక గిరిజ‌న నాయకురాలిని అవమానించినందుకు మీరు దోషులుగా ఉన్నారు...ఒక గిరిజన మహిళకు ఇచ్చిన గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతుంది. ఒక పేద గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది” అని లోక్‌సభలో స్మృతి ఇరానీ అన్నారు. 

సభ నేలపై, రాష్ట్రపతిపై అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో కోరారు. కాగా బీజేపీ ఆరోపణపై చౌదరి స్పందిస్తూ, “క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు” అని చెప్పగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంజన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు.

మతతత్వ శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధం.. ప్ర‌త్యేక చ‌ట్టాలు తెస్తాం..: క‌ర్నాట‌క సీఎం

ఇదిలా ఉండ‌గా.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సందీప్ కుమార్ పాఠక్, సుశీల్ కుమార్ గుప్తా, ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్‌లతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు గురువారం స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. దీంతో ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో స‌స్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 27కి చేరింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios