Viral Video: ఉత్తరప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచరమ్మ తన క్లాస్‌రూమ్‌లో ఓ విద్యార్థితో మసాజ్ చేయించుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఆ టీచరమ్మను సస్పెండ్ చేశారు. ఈ ఘటన యూపీ హర్దోయ్ లోని పోఖరి ప్రైమరీ స్కూల్‌లో జరిగింది.
Viral Video: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు.. అతిగా ప్రవర్తించింది. తాను ఓ రాణిగా.. పిల్లలను తన బానిసలుగా, పని మనుషులుగా భావించుకుంది. తరగతి గదిలో పిల్లలతో సేవలు చేయించుకుంటుంది. ఓ టీచరమ్మ రాణిలాగా దర్జాగా కూర్చీలో కూర్చోని ఉండగా.. ఓ విద్యార్థి ఆమె చేతులను మసాజ్ చేస్తున్నాడు. ఇతర విద్యార్జులు ఆమెకు తాగడానికి నీళ్లు అందించడం, పుస్తకాలు అందించడం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఆ టీచరమ్మకు ఓ రెంజ్ లో షాక్ తగిలింది. సదరు ఉపాధ్యాయురాలిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ వీడియోలో.. సదరు ఉపాధ్యాయురాలు తరగతి గదిలో ఓ కూర్చీలో సాగిలా పడినట్టు కూర్చుని .. విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో ఒక చేతిలో వాటర్ బాటిల్‌తో పట్టుకుని నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తుంది. ఒక పిల్లవాడు టీచర్ ఎడమ చేతిని నొక్కుతూ.. మసాజ్ చేస్తున్నాడు. మరోవైపు.. ఆమె తరగతిలోని ఇతర పిల్లలను అటు ఇటు తిరుగుతూ.. అల్లరి చేస్తున్నారు. ఆ టీచరమ్మ కూడా పిల్లలకు ఏదో చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే.. పిల్లలు మసాజ్ చేస్తున్న ఆ వీడియోను గుర్తు తెలియని వ్యక్తి తీశాడు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఉన్న మహిళా టీచర్ ను ఊర్మిళా సింగ్‌గా గుర్తించారు. ఆమె బవాన్ బ్లాక్‌లోని పోఖారీ ప్రైమరీ స్కూల్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖాధికారి స్పందించారు. మొత్తం విషయంపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని ఆదేశించారు.
దీంతో తరగతి గదిలో పిల్లలతో సేవలు చేయించుకున్న ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ.. డీఈవో బీపీ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హర్దోయ్ టీచర్ పిల్లలకు చదువు చెప్పకుండా.. వారిని తన సేవ చేయమని బెదిరించే వారని గతంలో కూడా పలు ఆరోపణలున్నాయి. తాజాగా ఈ వీడియోతో ఆ ఆరోపణలు కూడా బహిర్గతం అయ్యాయి.
