కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, అతని స్నేహితుడు మరియు మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నుంచి స్పెషల్ రెస్పాన్స్ వచ్చింది. విరాట్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, అతన్ని తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా పిలిచిన డివిలియర్స్, అతడి కెరీర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీని "బిస్కోటి" అనే పేరుతో ప్రేమగా పిలిచిన డివిలియర్స్, అతడి పట్టుదల, ఆటతీరుతో ఎప్పుడూ ప్రేరణ పొందానని చెప్పాడు.
“నేను మొదటిసారి టెస్ట్ క్రికెట్‌లో బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలోకి తీసుకెళ్తుందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది, నన్ను ఆకృతి చేసింది, జీవితాంతం నేను నేర్చుకునే పాఠాలను నేర్పింది” అని అతను చెప్పాడు.విరాట్ టెస్ట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లను దాటి వచ్చాడు. 2013లో దక్షిణాఫ్రికా టూర్‌లో తొలిసారి కఠినమైన కండిషన్లలో ఆడిన కోహ్లీ, జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్‌లో 119, 96 పరుగులతో భారత జట్టును గెలుపు వైపు నడిపాడు. ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ప్రదర్శన.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విరాట్, టెస్ట్ క్రికెట్‌ను వీడుతున్నట్టు ప్రకటించాడు. 14 ఏళ్లుగా దేశం కోసం బ్లూ జెర్సీ ధరించి ఆడిన కోహ్లీ, ఈ ఫార్మాట్ తనను ఎంతగా మార్చిందో ఆ ఎమోషనల్ మెసేజ్ ద్వారా వ్యక్తం చేశాడు.ఈ నిర్ణయం తీసుకునే ముందు బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్టు సమాచారం. క్రికెట్‌కు ఇచ్చిన సర్వస్వం, ప్రోత్సాహకంగా నిలిచిన ఆటతీరు వల్లే కోహ్లీ నిజమైన లెజెండ్‌గా గుర్తింపు పొందాడు.