క్షీణించిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోగ్యం, ఆసుపత్రికి తరలింపు

First Published 18, Jun 2018, 4:15 PM IST
AAP's Manish Sisodia, On Hunger Strike At Lt Governor's, Taken To Hospital
Highlights

క్షీణించిన ఆరోగ్యం


న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం  క్షీణించడంతో మనీష్ సిసోడియాను సోమవారం నాడు ఆసుపత్రికి తరలించారు. కీటోన్స్ పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోనే సీఎం కేజ్రీవాల్ నిరసన కొనసాగిస్తున్నాడు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ తదితులు దీక్ష చేస్తున్నారు. దీక్ష కారణంగా అనారోగ్యం పాలైన మంత్రి సత్యేంద్రజైన్ ను ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. 

మరోవైపు సోమవారం నాడు అనారోగ్యానికి గురైన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడ ఆసుపత్రికి తరలించారు. కీటోన్స్ లెవల్స్ తగ్గడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. సీఎం కేజ్రీవాల్ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

మరోవైపు ఢిల్లీ సీఎంతో చర్చలు జరిపేందుకు ఐఎఎస్ లు సంసిద్దతను ప్రకటించారు. ఇదిలా ఉంటే  ఢిల్లీలోని లెఫ్టినెంట్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ తో పాటు కొందరు మంత్రులు నిరసన దీక్షకు దిగడంపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరి కార్యాలయంలో నిరసన దిగడం ఎలా సరైందని కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఐఎఎస్ లు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ  ఢిల్లీలోని లెఫ్టినెంట్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా మంత్రులు సుమారు 8 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.


 

loader