Lakme Fashion Week: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరుస్తూ.. ర్యాంప్ వాక్ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆయన షోస్టాపర్‌గా అలరించారు.
AAP MP Raghav Chadha: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తళుక్కుమన్నారు. ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. ఆదివారం జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నారు. బ్లాక్ కలర్ లో మెరుస్తున్న డ్రెస్.. బ్రౌన్ బెల్ట్ ధరించి కనిపించారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో భాగంగా డిజైనర్ పవన్ సచ్‌దేవ కోసం షోస్టాపర్‌గా తళుక్కుమన్న చద్దా.. నటుడు అపర్‌శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్ వాక్ చేసి అలరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను రాఘవ్ చద్దా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పంజాబ్ యూనిట్ కో-ఇన్‌చార్జ్‌గా రాఘవ్ చద్దా ఉన్నారు. AAP పంజాబ్ ఎన్నికలలో మెజారిటీ సీట్లను గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. 33 ఏళ్ల చద్దా.. పెద్దల సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం. ప్రస్తుతం ఆప్ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ లో అధికారంలో కొనసాగుతోంది. ఇక లాక్మే ఫ్యాషన్ వీక్‌లో షోస్టాపర్ గా మారిన చద్దాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, పలువురు బాలీవుడ్ తారలు ర్యాంప్‌పై హొయలొలికించారు. నటీమణులు అనన్య పాండే, కంగనారనౌత్, పూజా హెగ్దే, ఊర్వశీ రౌటెలా తదితరులు షోస్టాపర్లుగా సందడి చేశారు.
