Asianet News TeluguAsianet News Telugu

టికెట్ ఇవ్వలేదని విద్యుత్ టవర్ ఎక్కిన మాజీ కౌన్సిలర్.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు

ఆమ్ ఆద్మీ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హాసన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
 

aap former councillor threatens party for not giving b forms to him, climbs pols
Author
First Published Nov 14, 2022, 2:57 AM IST

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హాసన్ నవంబర్ 13వ తేదీన తనకు టికెట్ ఇవ్వటం లేదని ఓ హై టెన్షన్ వైర్‌లు గల టవర్‌ను ఎక్కాడు. ఢిల్లీలో శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ఎదుట ఉన్న విద్యుత్ టవర్‌ను ఎక్కాడు. ఆప్ అవలంబిస్తున్న తప్పుడు వైఖరిని వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేసింది.

వచ్చే ఢిల్లీ పౌర సంస్థల ఎన్నికలో పోటీ చేయడానికి హసీబ్ ఉల్ హాసన్‌‌కు పార్టీ టికెట్ ఇవ్వలేదు. తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించాడు. ఈ విషయాన్ని చెప్పి హసీబ్ ఉల్ హాసన్ వెంటనే ఆ టవర్‌ను ఎక్కేశాడు.

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఇప్పటికే తొలి విడతలో భాగంగా 134 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ 134 మంది ఆప్ అభ్యర్థుల జాబితాలో 70 మహిళలకూ టికెట్లు వచ్చాయి. నరైనా స్థానం నుంచి ఆప్ విజయం సాధించిన ఎమ్మెల్యే విజేందర్ గార్గ్‌ను కూడా అంగీకరించారు. 

Also Read: 'మేం చేసేదే చెప్తాం': దేశ రాజధాని వాసులకు సీఎం కేజ్రీవాల్ హామీలు

కాగా, ఢిల్లీ సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ ముకేశ్ గోయల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆప్‌లో చేరారు. ఈయన ఆదర్శ్ నగర్ వార్డుకు తమ్ముడు నరైనా విజేందర్ గార్గ్ కూడా ఉన్నాడు. కాగా, కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన కౌన్సిలర్ గుడ్డి దేవి కూడా ఈ సారి తిమర్పూర్‌లోని మల్కా గంజ్ నుంచి పోటీ చేయబోతున్నారు. 

మున్సిపల్ కార్పొరేషణ్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు డిసెంబర్ 4వ తేదీన జరగాల్సి ఉన్నది. ఆప్ శనివారం నాడు దాని 117 అభ్యర్థులతో రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios