Asianet News TeluguAsianet News Telugu

'మేం చేసేదే చెప్తాం': దేశ రాజధాని వాసులకు సీఎం కేజ్రీవాల్ హామీలు

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంసీడీ) ఎన్నిక‌ల‌ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ  వాసుల‌కు కీల‌క హామీలిచ్చారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌లను పూర్తి చేయడం, పౌర సంస్థలలో అవినీతిని అంతం చేయడం సహా పది హామీలను ఇచ్చారు. 

Arvind Kejriwal announces 10 guarantees
Author
First Published Nov 11, 2022, 5:15 PM IST

ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంసీడీ) ఎన్నిక‌ల‌ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ  వాసుల‌కు కీల‌క హామీలిచ్చారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌లను పూర్తి చేయడం, పౌర సంస్థలలో అవినీతిని అంతం చేయడం సహా 10 హామీలను ప్రకటించారు. తాము ఏం వాగ్దానమిచ్చామో..  అదే చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. 

అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ.. ఇతర పార్టీలు వచన పత్రాన్ని విడుద‌ల చేశాయని, వ‌చ్చే ఏడాది వారు దాన్ని సంక‌ల్ప్ ప‌త్రం అంటార‌ని, ఎన్నిక‌ల ముందు ఇచ్చే  హామీలను నేరవేర్చడంలో పలు పార్టీలు విఫలమయ్యాయని విమర్శలు గుప్పించారు.ఎన్నికల తర్వాత ఆ పార్టీలు తమ వాగ్దానాలు,మ్యానిఫెస్టోలను చెత్తకుండీలో వేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అన్నారు. డిసెంబర్ 4న జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన కేజ్రీవాల్ చేశారు. 

బిజెపిని దూషించిన కేజ్రీవాల్.. ఎంసిడికి నిధులు ఇవ్వలేదని వారు తనపై ఆరోపణలు చేశారనీ, చరిత్రలో మొదటిసారిగా కేంద్రం నిధులు ఇవ్వలేదని ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీని చెత్త రహితంగా మార్చేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చి ఏమీ చేయలేదని,ఎంసీడీ ఎన్నికల్లో 20 సీట్లకు మించి గెలుపొందలేదని ఆయన అన్నారు. 

మరోవైపు.. అధికారంలోకి వస్తే ఢిల్లీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రోడ్ల మరమ్మతులు, ఎంసీడీ పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరుస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. లోకల్ బాడీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం, ఇన్‌స్పెక్ట‌ర్ రాజ్‌కు తెర‌దించి సీల్ చేసిన షాపుల‌ను ఓపెన్ చేస్తామ‌ని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.  

 కేజ్రీవాల్ ఇచ్చిన పది హామీలు  

- సుందరీకరణ నగరం

- పల్లపు ప్రాంతాలను తొలగించడం

- పార్కింగ్ సమస్యకు పరిష్కారం

- ఢిల్లీలో విచ్చలవిడి జంతువుల నుంచి విముక్తి

- ఎంసీడీ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగుపరచడం

- పార్కులను మెరుగుపరచడం తద్వార ఢిల్లీ పార్కుల నగరంగా మార్చడం 

- తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం. నగరపాలక ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందజేయడం. 

- వ్యాపారులకు ఆన్‌లైన్‌లో లైసెన్స్‌లు ఇవ్వబడతాయి. "ఇన్‌స్పెక్టర్ రాజ్" విధానాన్ని తొలగించడం.

- వీధి వ్యాపారుల కోసం క్లీన్ వెండింగ్ జోన్ల ఏర్పాటు

 ఎంసీడీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 7న జరుగుతుంది. MCDలో బీజేపీ అధికారంలో ఉంది.2012లో ఉత్తర, దక్షిణ,తూర్పు కార్పొరేషన్‌లుగా విభజించబడింది. ఆ తర్వాత దీనిని ఏకీకృతం చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీగా నెలకొననున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios