Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం..  రాత్రంతా ఆందోళనలు చేపట్టిన ఎమ్మెల్యేలు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజీనామా చేయాలంటూ ఆప్ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌లు చేప‌ట్టారు.ఒకవైపు ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామాకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

AAP , BJP MLA s overnight protests at Delhi Assembly premises
Author
First Published Aug 30, 2022, 1:21 PM IST

ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం రాత్రంతా నిర‌స‌న‌ల ప‌ర్వం కొన‌సాగింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా జాగారం చేస్తూ.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేపట్టారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేసుకుంటా మంగ‌ళ‌వారం ఉదయం వరకు అసెంబ్లీలోనే ఉన్నారు. 

అస‌లేం జ‌రిగిందంటే..? 

అధికార ఆప్‌ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాలేదని నిరూపించేందుకు తాను బలపరీక్ష ఎదుర్కొంటానని కేజ్రీవాల్ ప్రకటించిన వెంటనే అసెంబ్లీలో వివాదం ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సెనా 2016లో రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో  ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మ‌ద్దతుగా బీజేపీ నిలువ‌డంతో పోరు తీవ్రమైంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ కి  వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలో నిరసనకు దిగే పరిస్థితి నెలకొంది.  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆప్ ఎమ్మెల్యేలంతా గాంధీ విగ్రహం వ‌ద్ద కూర్చోని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  ఎమ్మెల్యేలందరూ రాత్రికి అసెంబ్లీలోనే బస చేస్తారు. అనేక ఆంశాల్లో ఆప్ తో లెఫ్టినెంట్ గవర్నర్ విభేదాలు ఉండ‌టంతో రాజీనామా చేయాలనే డిమాండ్ చేశారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ vs  ఆప్ ప్రభుత్వం 
 
గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై ఆప్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు మద్యం కుంభకోణం దర్యాప్తు, సింగపూర్ టూర్‌కు ఆమోదం లభించకపోవడం వివాదాన్ని పెంచుతుండగా, మ‌రోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ పలు ప్రతిపాదనలను వెనక్కి పంపడం వివాదాన్ని మరింత పెంచింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు  లెఫ్టినెంట్ గవర్నర్ను బహిరంగంగా నిల‌దీశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేయాలని ఎందుకు కోరుతున్నారు?

వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కాకముందు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆ స‌మ‌యంలో(2016లో) రూ.1400కోట్ల అవినీతికి పాల్పడ్డరని, నోట్ల రద్దు సమయంలో.. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ పేరుతో పెద్ద ఎత్తున పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చ‌ర‌నే ప‌లు ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంపై సీబీఐకి ఆప్ నేత‌లు ఫిర్యాదు చేశారు.  
 
ఆప్ కోపానికి కార‌ణ‌మ‌దేనా ?  

ఇటీవల ఆప్ ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేసింది. ఆ ఫైళ్ల మీద సీఎం సంతకం చేయని కారణంగా 
LG  వీకే  సక్సేనా వాటికి వెనక్కి తిరిగి పంపించారు. దీంతో ఆప్ నేత‌ల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. నిజానికి LG  వీకే  సక్సేనా కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. సీఎం సంతకం చేయని ఎన్నో ప్రతిపాదనలు  త‌మ వ‌ద్ద‌కు వస్తున్నాయని, అందుకే ఆ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వద్ద సమాచారం ఉందో లేదో అర్థం కావడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అన్ని ప్రతిపాదనలపై సంతకం చేసిన తర్వాతే ..వాటిని తనకు పంపాలని వీకే సక్సేనా సూచించారు. ఇప్పుడు ఆ లేఖ తర్వాతే.. సీఎం సంతకం లేని 47 ఫైళ్లను  LG  వీకే  సక్సేనా తిరిగి వెనక్కి పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios