దేశవ్యాప్తంగా "మోదీ హఠావో-దేశ్ బచావో" అనే ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ  ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆ పార్టీ(ఆప్) మీడియా సమన్వయ కమిటీ ఛైర్మన్ నవాబ్ నాసిర్ అమన్ మాట్లాడుతూ.."నిరక్షరాస్యుడు దేశాన్ని నడపలేడని" అన్నారు.

ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ సమరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై ఆప్ టార్గెట్ చేసింది. దేశంలో ద్వేషాన్ని అరికట్టడానికి, విధానాలను రూపొందించడానికి ,దేశ వ్యవస్థాపక పితామహుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతుడైన ప్రధానమంత్రి అవసరమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.

ఆప్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నవాబ్ నాసిర్ అమన్ ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ అనే పోస్టర్ ను ప్రారంభిస్తూ.. నిరక్షరాస్యుడు దేశాన్ని నడపలేడు. ప్రధాని మోడీ నిరక్షరాస్యుడనని అన్నారు. విద్వేషాన్ని అరికట్టడానికి, విధానాన్ని రూపొందించడానికి భారతదేశానికి విద్యావంతులు కావాలన్నారు. ఆప్ దేశవ్యాప్తంగా 'మోదీ హటావో-దేశ్ బచావో' అనే ప్రచారాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ ప్రచారానికి పార్టీ విమర్శలను ఎదుర్కొంటుంది, జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. కానీ, ఈ ప్రచారాన్ని మాత్రం ఎవరు ఆపలేరని అన్నారు.

దేశాన్ని రక్షించాలంటే.. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంకే గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ కలలు సాకారం కావాలంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి సాగనంపాలని అన్నారు. కోర్టులు, ఈడీ,ఈసిఐ వంటి ఏజెన్సీలను ప్రధాని మోడీ దుర్వినియోగం చేస్తున్నారని , మోదీ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని ఆరోపించారు. మనం కొత్త స్వాతంత్య్ర పోరాటం చేయాలనీ, మనం చదువుకున్న ప్రధానిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మాట్లాడుతూ, “ప్రతి ముస్లిం, హిందువు , సిక్కు నాణ్యమైన విద్య,వైద్యం, శాంతిని పొందాలి. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులకు ED సమన్లు ​​జారీ చేస్తుంది, దాడులు చేస్తుందని ఆరోపించారు. నవాబ్ నసీర్ అమన్ మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొంతమంది వ్యాపారుల సంక్షేమం కోసమే కృషి చేస్తోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో అంతా బాగానే ఉంటే.. ఇప్పటి వరకూ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని అన్నారు.