Asianet News TeluguAsianet News Telugu

ఔరంగాబాద్‌లో ఆదిత్య థాక్రే కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. పార్టీ ఆగ్ర‌హం, చర్యల‌కు డిమాండ్

Aurangabad: ఔరంగాబాద్ లో శివ‌సేన నాయ‌కుడు ఆదిత్య థాక్రే కాన్వాయ్ పై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై ఆ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాళ్ల‌దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
 

Aaditya Thackeray's convoy attacked with stones in Aurangabad The party's anger and demand for action
Author
First Published Feb 8, 2023, 12:28 PM IST

Aaditya Thackeray's convoy attacked with stones: ఔరంగాబాద్ లో శివ‌సేన నాయ‌కుడు ఆదిత్య థాక్రే కాన్వాయ్ పై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై ఆ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాళ్ల‌దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. మంగళవారం సాయంత్రం పార్టీ శివ సంవాద్ యాత్ర సందర్భంగా ఔరంగాబాద్ లోని వైజాపూర్ ప్రాంతంలో శివసేన (ఉద్ధవ్ థ‌క్రే వర్గం) నాయకుడు ఆదిత్య ఠాక్రే కాన్వాయ్ పై గుర్తుతెలియ‌ని దుండ‌గులు రాళ్లు విసిరారు. రమాబాయి అంబేద్క‌ర్ ఊరేగింపు కూడా శివసేన వేదికకు సమీపంలో జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

 

 

ఊరేగింపు నిర్వహిస్తున్న వారికి, అక్కడ ఉన్న శివసేన మద్దతుదారులకు మధ్య చిచ్చు పెట్టేందుకు రాళ్లు రువ్వారని యాత్రలో ఉన్న మహారాష్ట్ర శాసనమండలిలో శివసేన ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వే ఆరోపించారు. "సభాస్థలి నుంచి బయలు దేరుతుండగా కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బోర్నారెకు మద్దతుగా నినాదాలు చేశారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు సంఘ విద్రోహ శక్తులు చేసిన ప్రయత్నమిది" అని అంబాదాస్ దన్వే తెలిపారు. రాళ్లదాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

డీజే, ఊరేగింపును ఆపాలని పోలీసులు కోరడంతో జనం ఆగ్రహానికి గురై కాన్వాయ్ పై రాళ్లు రువ్వడం ప్రారంభించారని దన్వే తెలిపారు. పరిస్థితిని గమనించిన ఆదిత్య ఠాక్రే వేదికపైకి వచ్చి ప్రసంగించాల్సి వచ్చింది. సభాస్థలికి హాజరైన వారికి క్షమాపణలు కూడా చెప్పార‌ని తెలిపారు. "పరిస్థితిని గమనించిన ఆదిత్య ఠాక్రే వేదికపైకి వచ్చి ప్రసంగించారు. అసౌకర్యానికి ప్రజలకు క్షమాపణలు చెప్పానని, డీజే ఆడి ఊరేగింపు నిర్వహించాలనుకుంటే చేసుకోవచ్చని" చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి థాక్రే కార్యక్రమానికి తగిన భద్రత కల్పించని ఎస్పీ సహా పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబాదాస్ దాన్వే మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios