న్యూఢిల్లీ:పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2021 మార్చి 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఆదార్, పాన్ కార్డు లింక్ గడువును  పొడిగించాలని నిర్ణయం తీసుకొంది.  పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకొంది. 

పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కూడ ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఒకవేళ ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపన్ను శాఖ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆదార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ ప్రకటనలో తెలిపింది. 

పాన్ కార్డును ఆధార్ తో ఆన్ లైన్ లో అనుసంధానం సౌకర్యంగా లేని వారు ఆఫ్ లైన్ లో లేదా ఎన్ఎస్‌డిఎల్ , పాన్ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చని ఐటీ శాఖ ప్రకటించింది.