ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారినికి ఒడిగట్టిన ఓ యువకుడికి ఐదు సిట్ అప్ ల శిక్ష విధించి సరిపెట్టారు ఆ గ్రామపెద్దలు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

బీహార్ రాష్ట్రంలో ఓ పంచాయితీ తీర్పు మరో సారి వార్తల్లో నిలిచింది. ఓ యువకుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యారానికి ఒడిగట్టగా.. అతడికి కేవలం 5 సిట్ అప్ ల శిక్ష విధించింది. బాధిత కుటుంబం పోలీసులకు దగ్గరకు వెళ్లకుండా చేసింది. అయితే నిందితుడు చేసిన సిట్ అప్ లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మన రాజ్యాంగ స్ఫూర్తి యువత కేంద్రంగా ఉంది.. యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉంది: ప్రధాని మోదీ

వివరాలు ఇలా అన్నాయి. బీహార్ నవాడాలోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఐదు సంవత్సరాల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇంటికి వచ్చిన తరువాత తనపై జరిగిన దారుణాన్ని తన మేనమామకు వివరించింది. అయితే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు. కానీ దాని కంటే ముందే నిందితుడు ఈ విషయాన్ని ఆ గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్.. ఈవోఎస్‌-06 ఉపగ్రహం సెపరేషన్ విజయవంతం..

దీంతో ఆ గ్రామ పెద్దలు పంచాయితీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో నిందితుడు చేసిన నేరానికి శిక్షగా ఐదు సిట్ అప్ లు చేయాలని తీర్పు చెప్పారు. దీంతో అతడు గ్రామ పెద్దల ఆదేశానుసారం సిట్ అప్ లు తీశాడు. తరువాత నిందితుడిని వదిలివేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో ఒకరు వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. అందులో నిందితుడు ముఖానికి శాలువా కప్పుకొని సిట్ అప్ లు చేస్తున్నాడు.

Scroll to load tweet…

ఈ వీడియో స్థానిక పోలీసుల వద్దకు చేరింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు అకాబర్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.