మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తనకు దూరంగా  వుంటున్న మాజీ ప్రియురాలిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. యువతిని రెండు రోజుల పాటు ఓ లాడ్జీలో బంధించి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం లాడ్జీ నుండి  తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అఘాయిత్యం గురించి బయటపడింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర పోల్ఘార్ జిల్లాలో బోయిసర్‌ పట్టణానికి చెందిన ఫైజల్ షఫీ( 23) అనే యువకుడు ఓ యువతి(21)  ప్రేమించుకున్నారు. అయితే ఫైజల్ ప్రవర్తన నచ్చక సదరు యువతి గత రెండేళ్లుగా అతడికి దూరంగా వుంటోంది. దీంతో ఫైజల్ ఆమెపై ద్వేషాన్ని పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఓ ప్లాన్ వేశాడు. 

యువతికి తెలియకుండా రహస్యంగా ఆమె వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించాడు. వీటిని ఆమెను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించకుంటే ఈ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అందరికి పంపిస్తానని యువతిని భయపెట్టి ఈ నెల 10 వ తేదీన పట్టణంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు.  

లాడ్జీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో యువతిని బంధించాడు. ఇలా రెండు రోజుల పాటు ఆమెను గధిలోని నిర్భందించి పలుమార్లు దారుణంగా అత్యాచారం చేశాడు. ఇవాళ ఉదయం ఈ లాడ్జీ నుండి తప్పించుకున్న యువతి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు తెలిపింది. 

బాధిత యువతి నుండి పిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందుతుడు షపీని అరెస్ట్ చేసి అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుండి మొబైల్ ఫోన్ కూడా స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.