New Delhi: తాను డేటింగ్ లో ఉన్న మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు మూడు రోజుల క్రితం మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాబా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.
Delhi Woman's Body Found In Freezer: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రీజర్ లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. తాను డేటింగ్ లో ఉన్న మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు మూడు రోజుల క్రితం మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాబా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లోని ఓ దాబాలో ఫ్రీజర్ లో 25 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం మహిళను హత్య చేసి మృతదేహాన్ని దాబా ఫ్రీజర్ లో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దాబా యజమాని సాహిల్ గహ్లోత్ ను అరెస్టు చేశారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు.
అనుమానంతో దాబా యజమాని సాహిల్ గహ్లోత్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, సాహిల్ గహ్లోత్, మహిళ రిలేషన్ షిప్ లో ఉన్నారని పోలీసు అధికారి విక్రమ్ సింగ్ తెలిపారు. 'గహ్లోత్ మరో మహిళను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈ విషయం అతని ప్రియురాలికి తెలియడంతో ఆమె అతడితో గొడవపడి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది' అని పోలీసు అధికారి ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను చంపి శవాన్ని తన దాబాలోని ఫ్రీజర్ లో దాచాడు. రెండు మూడు రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. దీనిపై విచారణ జరుగుతున్నదనీ, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
