ఛత్తీస్ గఢ్ లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కోడికి పక్కింటి వారి నుంచి ప్రాణ హాని ఉందని, దానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. తన కోడికి పొరుగింటి వారి నుంచి ప్రాణహాని ఉందని, దానికి రక్షణ కల్పించాలని కోరతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు గాయపడిన కోడిని కూడా ఆమె పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చింది. ఆమె ఫిర్యాదు విని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన కోడిని దొంగించడానికి ప్రయత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తప్పుడు కేసులు: కోజికోడ్ ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడులు

వివరాలు ఇలా ఉన్నాయి. రాయ్‌పూర్‌ జిల్లాకు తూర్పున 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌లోని రతన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ అనే మహిళ దేశీయ కోళ్లను పెంచుతుంటుంది. ఆమెకు కోళ్ల పెంపకం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమెకు ఉన్న కోళ్లలో ఒక కోడిని ఆమె పొరిగింటివారు దొంగించడానికి ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. 

ఫ్రమ్ ది ఇండియా గేట్: ఈ సీఎం ఎవరు?.. కుక్కర్ల పంపిణీ కష్టాలు.. ట్వీట్‌పై గొప్ప అంచనాలు..

దీంతో కోడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కానీ దానికి గాయాలు అయ్యాయి. దీనిని జాంకీబాయి గమనించింది. ఈ పరిణామం పట్ల ఆగ్రహించిన ఆ మహిళ.. కోడిని తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లింది. తన కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తన కోడికి రక్షణ కల్పించాలని కోరింది. 

మేము పీఎస్‌యూలను అమ్మడం లేదు.. ఇది ప్రతిపక్షాలకు తెలిసినా విమర్శలు చేస్తున్నాయ్ - సీతారామన్

కాగా.. ఈ విషయంలో రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ.. ఆ మహిళ గాయపడిన కోడితో పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని చెప్పారు. మహిళ ఫిర్యాదును స్వీకరించామని అన్నారు. ఆమె ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు.