Asianet News TeluguAsianet News Telugu

సెల‌వు రోజు ప‌నికి నో చెప్ప‌డానికి ఐదేండ్లు ప‌ట్టింది.. చివరకు ఏం జరిగిందంటే..? వైర‌ల్ పోస్ట్ !

work on a holiday: ఐదేండ్ల లో మొద‌టిసారి సెలవు రోజుల్లో ఆఫీసు పనులకు నో చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుపుతూ ఒక వ్య‌క్తి ట్వీట్ చేశాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రఘు ట్విటర్ లో షేర్ చేసిన ఈ పోస్టులో తన మేనేజర్ లో జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్ ల‌ను పంచుకున్నారు. సదరు వ్యక్తి (అతని గుర్తింపును వెల్లడించలేదు) రఘును సెలవు ఉన్న రోజు ప‌ని చేయమని కోరడంతో సంభాషణ ప్రారంభమైంది. 
 

A Twitter user shared what happened when he said no to extra work on a holiday RMA
Author
First Published Mar 23, 2023, 4:57 PM IST

corporate culture-work on a holiday: ఇటీవ‌లి కాలంటో సెల‌వు రోజుల్లో కూడా ప‌ని చేయాల‌ని లేదా ఏదో విష‌యం గురించి సెల‌వుల్లో ఉద్యోగిని ఆఫీసుకు పిల‌వ‌డం కామ‌న్ గా మారింది. దీనికి ఉద్యోగులు నో చెప్ప‌డం త‌క్కువ‌గానే క‌నిపిస్తుంది. ఇదే కోవ‌లో మీరు కార్పొరేట్ సంస్కృతిలో హడావుడి చేసే వ్యక్తి అయితే వ్యక్తిగత జీవితం - మీ ఆఫీసు మధ్య సమతుల్యతను నిర్వహించడం చాలా కష్టమైన పని. కంపెనీ త‌మ ఆస్తి అని చూపించుకోవ‌డానికి ఆద‌న‌పు ప‌ని గంట‌లు సైతం ప‌నిచేయాల్సి రావచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఒక వ్య‌క్తి సెల‌వు రోజు ఆఫీసు ప‌నికి నో చెప్ప‌డానికి సంబంధించి ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

ఐదేండ్ల లో మొద‌టిసారి సెలవు రోజుల్లో ఆఫీసు పనులకు నో చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుపుతూ ఒక వ్య‌క్తి ట్వీట్ చేశాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రఘు ట్విటర్ లో షేర్ చేసిన ఈ పోస్టులో తన మేనేజర్ లో జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్ ల‌ను పంచుకున్నారు. సదరు వ్యక్తి (అతని గుర్తింపును వెల్లడించలేదు) రఘును సెలవు ఉన్న రోజు ప‌ని చేయమని కోరడంతో సంభాషణ ప్రారంభమైంది. అయితే, రఘు దానిని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇంకొన్ని మెసేజ్ లు రాసిన తర్వాత కూడా రఘు తన పనిదినం నాడు ఈ విషయాన్ని చూసుకోవాలన్న తన అభ్యర్థనను అంగీకరించే వరకు తన వైఖరిని కొనసాగించాడు.

'సెలవుల్లో పనిచేయడానికి నో చెప్పడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. నాలా ఉండకండి..  ముందు లేచి నిలబడండి. హ్యాపీ ఉగాది' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్టు వైర‌ల్ గా మారింది.

 

 

ఈ పోస్టును 1.2 మిలియన్లకు పైగా వీక్షించారు. అనేక ప్రతిస్పందనలను పొందింది. మేనేజర్ అభ్యర్థనను సున్నితంగా, దృఢంగా తిరస్కరించిన రఘును నెటిజ‌న్లు అభినందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన కార్పొరేట్ సంస్కృతిలో నో చెప్పడం ఎలా సాధారణీకరించబడుతుందో చాలా మంది పేర్కొంటూ ట్వీట్లు చేశారు.

 

 

 

కాగా, ఉగాది సందర్భంగా రఘు సెలవులో ఉన్నాడు. హిందూ క్యాలెండర్ మాసం చైత్ర మాసం మొదటి రోజును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవాలలో ఉగాదిగా జరుపుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios