యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వెళ్లి ట్రక్కను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు హాస్పిటల్ లో చికిత్స  పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉంది. 

ఓ కారు అతి వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించాడు. ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

చారిత్రాత్మకం.. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు.. ఏ కేసులో అంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బందా జిల్లాలో ఎనిమిది మంది గురువారం ఓ కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కారు వేగంగా వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న వారందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే స్పందించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా.. అప్పటికే అందులో ఐదుగురు మరణించారు.

Scroll to load tweet…

మిగితా ముగ్గురు క్షతగాత్రులను దగ్గరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి తరలించారు. అయితే అందులో ఒకరు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే మరణించారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని బండా డీఎం దు్గా శక్తి నాగ్ పాల్ తెలిపారు.

ఎన్డీయేను వీడిన నేతలను శిక్షించాలి - కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఇదే రాష్ట్రంలోని ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఈ నెల 22వ తేదీన ఉదయం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు కూలీలను తీసుకొని శ్రావస్తి నుంచి గుజరాత్ వెళ్తోంది. అయితే ఎటావా జిల్లాలోని చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్ ప్రెస్ వే పైకి చేరుకున్న సమయంలో బస్సు ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

ఛీ.. వీళ్లు అసలు తల్లిదండ్రులేనా ? రూ. 40 వేల కోసం.. 27 ఏళ్ల వ్యక్తికి 12 ఏళ్ల కూతురి విక్రయం

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 30 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని సైఫాయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్కిల్ ఆఫీసర్ సైఫాయి నాగేంద్ర కుమార్ చౌబే తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.