భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,88,755కి చేరుకుంది.
భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 5.3 శాతం తగ్గింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,88,755కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనాతో 36 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,26,033కి చేరుకుంది.
గత 24 గంటల్లో మొత్తం 18,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,32,10,522కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,52,200గా ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఈ సంఖ్య 2,100 పెరిగింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,80,202 నమూనాలను పరీక్షించారు.
తాజా కరోనా కేసులలో.. అత్యధికంగా మహారాష్ట్రలో 2,336 కేసులు, కేరళలో 2,252 కేసులు, తమిళనాడులో 2,014 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 1,844 కేసులు, కర్ణాటకలో 1,456 కేసులు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 48.83 శాతం కొత్త కేసులు నమోదవగా, ఒక్క మహారాష్ట్రలోనే 11.52 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. శనివారం రోజున దేశంలో 28,83,489 డోస్‌ల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు అందించిన డోసుల సంఖ్య 2,01,99,33,453కి చేరుకుంది.
