Asianet News TeluguAsianet News Telugu

లారీని ఢీకొని బోల్తా పడిన స్కూల్ బస్సు.. డ్రైవర్ తో పాటు ఇద్దరు విద్యార్థులు మృతి.. పంజాబ్ లో ఘటన

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు లారీని ఢీకొనడంతో అది బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, మరో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

A school bus collided with a lorry and overturned.. Driver and two students died.. Incident in Punjab
Author
First Published Dec 3, 2022, 3:06 PM IST

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. డ్రైవర్ కూడా మరణించారు. ఈ ప్రమాదం పంజాబ్ లోని తరన్ తరణ్‌ జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు ఎప్పుటిలాగే విద్యార్థులను తీసుకొని శనివారం ఉదయం బయలుదేరింది.

సీజేఐ చంద్రచూడ్ సమక్షంలో జడ్జీల నియామకంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కామెంట్లు

అయితే ప్రయాణం ప్రారంభమైన కొంత సమయానికే ఓ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. వాహనం అద్దాలు పగిలిపోయాయి. సీట్లు విరిగిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సమాచారం అందడంతో వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. 

2047 నాటికి భారత నౌకాదళం 'ఆత్మనిర్భర్' గా మారుతుంది: నావల్ చీఫ్ హరి కుమార్

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్లే ఇది చోటు చేసుకుందా ? లేక బాహ్య ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అని పరిశీలిస్తున్నారు. అయితే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. 

బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరి మృతి

ఈ బస్సు ప్రమాదంపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్  విచారం వ్యక్తం చేశారు. ‘‘ తరన్ తరణ్‌లోని షేక్‌చక్ గ్రామంలో పాఠశాల బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులను బలితీసుకున్న సంఘటన గురించి వినడం చాలా బాధగా ఉంది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన విద్యార్థులు పూర్తిగా కోలుకోవాలని వాహెగురు జీని ప్రార్థిస్తున్నాను.’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘనటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది... 

Follow Us:
Download App:
  • android
  • ios