ఓ వ్యక్తికి ఏం అర్జెంట్ వర్క్ ఉందో ఏమో తెలీదు గానీ.. పాపం బైక్ పై ప్రయాణిస్తూనే ల్యాప్ టాప్ లో వర్క్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. 

మీరు ల్యాప్ టాప్ లో వ‌ర్క్ చేయాలంటే ఎలాంటి ప్లేస్ లో కూర్చుంటారు.? ఓ టేబుల్ సెట్ చేసుకొని, దానికి అనుగుణంగా ఉన్న కుర్చీ వేసుకొని ప‌ని చేస్తారు. అలాంటి స‌దుపాయాలు ఏవీ లేక‌పోతే క‌నీసం బెడ్ పైనే కూర్చొనో లేదా ఒళ్లో పెట్టుకునో ప‌ని చేస్తారు. కానీ రోడ్డు మ‌ధ్య‌లో బైక్ పై ప్ర‌యాణిస్తూ ప‌ని చేయ‌రు క‌దా.. కానీ ఓ వ్య‌క్తి అలాగే చేశారు. ఏ అర్జెంట్ వ‌ర్క్ ఉందో ఏమో తెలీదు గానీ పాపంపై బైక్ పై ప్రయాణిస్తూనే ప‌ని చేస్తూ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. 

బీమా కోరేగావ్‌ కేసులో వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు

అది బెంగళూరులోని ఓ బిజీ రోడ్డు. రాత్రి స‌మ‌యం. ఆ స‌మ‌యంలో అంద‌రూ అంద‌రూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో కూడా హ‌ర్షీమీత్ సింగ్ అనే వ్య‌క్తి కూడా రోడ్డుపై ప్ర‌యాణిస్తున్నాడు. కానీ అత‌డి క‌ళ్ల‌కు ఓ వ్య‌క్తి విచిత్రంగా క‌నిపించాడు. బైక్ పై ప్రయాణిస్తూ ల్యాప్ టాప్ లో వ‌ర్క్ చేసుకుంటున్నాడు. దీంతో ఆయ‌న ఆ వ్య‌క్తి ఫొటో తీసి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ కు క్రేజీ క్రేజీ కామెంట్స్ వ‌స్తున్నాయి. 

ఈ ఫొటోకు “ బెంగళూరు అత్యుత్తమంగా ఉందా లేదా చెత్తగా ఉందా ? 11pm బెంగళూరు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌లలో ఒకటి. ఇక్కడ ఒక పిలియన్ రైడర్ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు. ఒక బాస్‌గా మీరు టార్గెట్ రీచ్ కావ‌డానికి మీ సహోద్యోగుల భ‌ద్ర‌త‌ను ఫ‌ణంగా పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న‌ట్ల‌యితే మీరు మళ్లీ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా మీరు ఆదేశించే స్థాయిలో ఉన్న‌ట్ల‌యితే ‘IT'S URGENT’, ‘DO IT ASAP’ అనే పదాలను మరింత జాగ్రత్తగా ఉప‌యోగించుకోవాలి. ఈ మాటలు మీ కింది ఉద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలియదు” అని హ‌ర్షీమీత్ సింగ్ క్యాప్ష‌న్ పెట్టాడు. 

లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన ఆయ‌న ఉద్దేశం ప్ర‌కారం.. ఆ బైక్ పై కూర్చున్న వ్య‌క్తి త‌న టార్గెట్ న్ రీచ్ కావ‌డానికి మార్గ మ‌ధ్యలోనే ప‌ని చేస్తున్నాడు. కానీ చాలా మంది నెటిజ‌న్లు అత‌డి అభిప్రాయం స‌రైంది కాద‌ని అన్నారు. అత‌డి ఆలోచ‌న‌ను పూర్తిగా వ్య‌తిరేకించారు. 

షాకింగ్ ఘటన.. నదితో ఈత కొడుతున్న బాలుడుని మింగేసిన మొసలి..

అయితే ఈ పోస్ట్ 40 వేలకు పైగా లైక్‌లతో లింక్డ్‌ఇన్‌లో దూసుకుపోయింది. మనిషి బహుశా ఏదో అత్యవసర పని చేస్తున్నాడని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ స్థలం బెంగళూరు కూడా కాదని కొందరు సూచించారు. మ‌రి కొంద‌రు ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బైక్ పై కూర్చున్న వ్య‌క్తి ‘RRR’ సినిమా చూస్తున్నారని కామెంట్స్ చేశారు. మరో వ్యక్తి అతడు పెట్టుకున్న నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉందని కామెంట్ చేశాడు. మరో వ్యక్తి బహుశా అతడు చివరి నిమిషంలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాడని కామెంట్ పెట్టాడు.