తమ కారు డ్రైవర్ తో కలిసి ఓ మైనర్ తన అక్కను, తల్లిని చంపేసింది. అనంతరం ఆ డ్రైవర్, ఆమె ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముంబాయిలో గురువారం కలకలం రేకెత్తించింది.
ముంబాయి ట్రోపాలిస్‌లోని కండివాలి ప్రాంతంలో మూసివేసిన హాస్పిటల్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, వారి డ్రైవర్ మృతదేహాలు గురువారం వెలుగు చూశాయి. ఈ ఘటన ఒక్క సారిగా ముంబాయిలో కలకలం సృష్టించింది. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించారు. 17 ఏళ్ల బాలిక డ్రైవర్‌తో కలిసి మొదట తన తల్లిని, అక్కను హత్య చేసిందని, ఆపై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో 60 ఏళ్ల డ్రైవర్ జేబులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. అందులో గత కొన్నేళ్లుగా కుటుంబంలో కొనసాగుతున్న కలహాల కారణంగా ఈ చర్యకు పాల్పడినట్టు మృతుడు పేర్కొన్నాడు.
విద్యార్థుల తల్లులకు అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు.. కీచక టీచర్ సస్పెండ్...
గత 15 ఏళ్లుగా మూతపడిన కందివాలి ప్రాంతంలోని రాధాబాయి దాల్వీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే మూడంతస్తుల ఆస్పత్రిలోని ఓ భాగంలో 45 ఏళ్ల కిరణ్ దాల్వీ తన ఇద్దరు కుమార్తెలుతో కలిసి ఉంటున్నారు. ఇందులో ఒకరు 26 ఏళ్లు ముస్కాన్ కాగా.. మరొకరు 17 ఏళ్ల మైనర్. వీరికి ఫ్యామిలీ డ్రైవర్ గా శివదయాల్ సేన్ (60) అనే వ్యక్తి గత పదేళ్ల నుంచి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కుటుంబంలో గొడవల వల్ల కిరణ్ భర్త వీరితో ఉండటం లేదు. ఆయన తన చిన్న కుమారుడితో కలిసి ఇండోర్ లో ఉంటున్నారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మూసి ఉన్న హాస్పిటల్ నుంచి ఒక్క సారిగా స్థానికులకు అరుపులు వినిపించాయి. దీంతో ఈ సమాచారం పోలీసులకు అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో ఇంట్లోని రెండో అంతస్తులో కిరణ్ రెండో అంతస్తులో, ముస్కాన్ కూడా అదే అంతస్తులోని వంటగదిలోనే రక్తంతో కొట్టుమిట్టాడుతూ చనిపోయి కనిపించారు. అయితే పోలీసులు మొదటి అంతస్తుకు చేరుకుంది. అక్కడ మూసి ఉన్న గది తలపులను పగులగొట్టింది. ఆ ప్రాంతంలో మైనర్, డ్రైవల్ శివదయాల్ సేన్ ల మృతదేహాలు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాయి. వారందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వారందరూ హాస్పిటల్ కు రాకముందే చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.
సుప్రీంలో శివసేనకు ఎదురు దెబ్బ: ఏక్‌నాథ్ షిండే సహా రెబెల్స్ పై ఉద్ధవ్ పిటిషన్ ఈ నెల 11న విచారణ
కుటుంబ కలహాలతో కలత చెంది కిరణ్, ముస్కాన్‌లను తాము హత్య చేశామని, తరువాత తాము కూడా ఆత్మహత్య చేసుకుంటున్నామని పేర్కొంటున్న సూసైడ్ నోట్ డ్రైవర్ జేబులో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విశాల్ ఠాకూర్ తెలిపారు. కిరణ్ తన భర్త నుంచి విడిపోవడానికి గల కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నేరానికి ఉపయోగించిన కొడవలిని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. ఆయుధాన్ని కాలినాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు.
