Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్ టీచ‌ర్ కు ‘‘మేక‌’’ అని నిక్ నేమ్ పెట్టిన స్టూడెంట్లు.. కార‌ణం తెలిసి భావోద్వేగానికి లోనైన టీచర్..

ఓ మ్యాథ్స్ టీచర్ కు స్టూడెంట్లు అందరూ ‘మేక’ అనే నిక్ నేమ్ పెట్టారు. మొదట్లో ఈ పేరు వినిపించినా పెద్దగా పట్టించుకోని ఆ టీచర్.. కొంత కాలం తరువాత తననే స్డూడెంట్లు ఎగతాళి చేస్తున్నారని బాధపడింది. కానీ తరువాత అలా ఎందుకు అంటున్నారో తెలుసుకొని భావోద్వేగానికి లోనైంది. 

The students nicknamed the maths teacher as "goat". The teacher was overjoyed knowing the reason.
Author
New Delhi, First Published Jul 1, 2022, 11:00 AM IST

మ్యాథ్స్ అంటే చాలా మంది స్టూడెంట్ల‌కు భ‌యం ఉంటుంది. అత్యంత‌ భయంకరమైన సబ్జెక్టులలో మ్యాథ్స్ ను ఒకటిగా పరిగణిస్తారు. అందుకే మాథ్స్ టీచ‌ర్లు అంటే చాలా మంది స్డూడెంట్ల‌కు కొంత బెరుకు ఉంటుంది. వారి మ‌న‌సుల్లో ఆ టీచ‌ర్ ప‌ట్ల ఒక ర‌క‌మైన భావ‌న ఉంటుంది. కొంద‌రు స్డూడెంట్లు టీచ‌ర్ల‌ను నిక్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. వారిపై జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ ఆ విష‌యం దాదాపుగా టీచ‌ర్ల దాకాపోదు. 

మహా సీఎం ఏక్‌నాథ్ షిండే, రెబెల్స్ పై సస్పెన్షన్:సుప్రీంలో శివసేన పిటిషన్

కానీ ఓ టీచ‌ర్ కు ఈ అనుభ‌వం ఎదుర‌య్యింది. దీంతో ఆమె చాలా బాధ‌ప‌డ్డారు. ఆమె ఓ మ్యాథ్స్ టీచ‌ర్. స్టూడెంట్లు అంద‌రూ ఆమెకు ‘‘ మేక (GOAT) ’’ అనే నిక్ నేమ్ పెట్టారు. ఆ విష‌యం ఆమెకు ఎలాగో తెలిసింది. స్డూడెంట్లు అంద‌రూ త‌న‌ను మేక అని అంటున్నార‌ని ఆవేద‌న చెందారు. అయితే ఇలా త‌న‌పై ఎందుకు జోక్ వేస్తున్నారో టీచ‌ర్ కు అర్థం కాలేదు. ఈ జోక్ ను అర్థం చేసుకోవ‌డానికి ఆమె ఇంట‌ర్నెట్ పై ఆధార‌ప‌డింది. ఆ టీచ‌ర్ Redditలోకి లాగిన్ అయ్యి ఈ విషయం పోస్ట్ చేశారు. అయితే ఆమెకు అక్క‌డ ల‌భించిన స‌మాధానం విని సంతోషించారు. స్డూడెంట్లు త‌న‌ను ఎగ‌తాళి చేయ‌డం లేదని, ప్ర‌శంసిస్తున్నార‌ని తెలుసుకున్నారు. ఆనందంతో పొంగిపోయారు. 

PuzzleBrain20, reddit అనే నేమ్ తో ఉన్న ఆ యూజ‌ర్.. ‘‘ నా స్టూడెంట్లు నన్ను మేక అని ఎందుకు పిలుస్తారు? ’’ అని ఆమె ప్రశ్నను పోస్ట్ చేశారు. ఆ Reddit గ్రూప్ లో ఉన్న వ్యక్తులు స్పందించారు. గత విద్యా సంవత్సరం నుంచి తన స్కూల్ లో ‘మేక‘ అనే జోక్ నడుస్తోందని అన్నారు. స్టూడెంట్లు అందరూ ఆమెను అలా పిల‌స్తుంటే న‌వ్వి ఊరుకునేది. ‘‘ నిజాయితీగా ఉండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఈ విషయంలో ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. కానీ నేనే వారికి జోక్ అవుతున్నానని తరువాత గ్రహించాను. నాకు వారితో మంచి అనుబంధం ఉంది. వారందరూ నిజంగా మంచి పిల్లలు, కాబట్టి వారు నన్ను ఎగతాళి చేస్తున్నారని నేను నిజంగా అనుకోను ” అని టీచర్ రాశారు. ఈ జోక్ అర్థం ఏమితో త‌న‌కు వివ‌రించాల్సిందిగా ఆమె యూజ‌ర్స్ ను కోరారు. 

కప్పు టీకి రూ.70లు.. ప్రయాణికుడికి షాక్ ఇచ్చిన రైల్వే అధికారులు..

ఈ ప్ర‌శ్నకు చాలా మంది స్పందించారు.ర అనేక మంది ఆమెను పొగిడారు. మీరు స్డూడెంట్ల దృష్టిలో ‘‘ అన్ని వేళ‌లా గొప్ప‌వారు (Greatest Of All Time - GOAT)  అని తెలిపారు. మ‌రో యూజ‌ర్ స్పందిస్తూ ‘‘అవును. ఆ స్టూడెంట్లు మిమ్మల్ని పూర్తిగా ఇష్టపడుతున్నారు.’’ అని కామెంట్స్ చేశారు. చాలా సేపు ఈ చర్చల్లో వచ్చిన కామెంటస్ చూసి.. స్టూడెంట్లు అందరూ తనను తనను ప్రశంసిస్తున్నారని తెలుసుకుంది. భావోద్వేగానికి లోనైంది. దీంతో ఆమె తన పోస్ట్ ను ఎడిట్ చేసింది. నేను కన్నీళ్లతో ఉన్నాను!!! ఈ సమయంలో వారు నన్ను మెచ్చుకుంటున్నారు. కానీ నేను నమ్మలేకపోతున్నాను!!!! ఈ ప్రశ్నకు సమాధానమిచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు!!!! ”… అంటూ ఆమె పేర్కొన్నారు. 

అయితే రెడ్డిట్ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఒక ట్విటర్ యూజర్ ఆ పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. “ ఈ టీచర్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయ‌డం. ఆమెను స్టూడెంట్లు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడం మినహా అంతా భయంకరంగా ఉంది” అని రాశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios