ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చినా అతడు మారలేదు. బెయిల్ పై వచ్చిన సమయంలో భార్యపై కోపంతో ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
అతడు హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అతడిపై అనేక కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల బైలుపై బయటకు వచ్చాడు. భార్యతో కలిసి జీవిస్తున్నాడు. రోజు వారి పనిలో నిమగ్నం అయ్యాడు. అయిత ఒక్క సారిగా భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో సెల్వరాజు, సత్య అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గృహ నిర్మాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తుండేవాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అతడు తరచూగా ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం (ఆగస్టు 25వ తేదీ)న ఉదయం పనికి వెళ్లిన సత్య సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో మళ్లీ భార్యా భర్తలకు గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సెల్వరాజ్ వంటగదిలోని కత్తి తీసుకుని సత్య కడుపులో పొడిచాడు.
అహ్మదాబాద్ కు మరో మణిహారం.. రివర్‌ఫ్రంట్ ఎఫ్‌ఓబి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
దీంతో ఆమె అస్వస్థతకు గురి అయ్యింది. రక్తపు మడుగులో పడి ఉన్న సత్యను ఆసుపత్రికి తరలించాలని నిందితుడు తన పెద్ద కొడుకును కోరాడు. వెంటనే ఆమెను కరూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే బాధితురాలు అప్పటికే మృతి చెందిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కరూర్ పోలీసులు విచారణ చేపట్టారు.
భార్యను పొడిచి హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సెల్వరాజ్ అలియాస్ శివ ఇప్పటికే ఒక హత్య కేసులో జైలుకు వెళ్ళాడు. అతడిపై అనేక ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
త్రిసభ్య ధర్మాసనానికి ‘ఉచితాలు’ కేసు.. రిఫర్ చేసిన సుప్రీంకోర్టు
ఇదే రాష్ట్రంలోని తిరువల్లూరు ప్రాంతంలో కూడా ఈ నెల 1వ తేదీన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగూర్ ప్రాంతానికి చెందిన మదన్, తమిళ సెల్వి మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మదన్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు.. భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు. దీంతో వరకట్నం పేరుతో తరచు వేధిస్తుండేవాడు. జూన్ 25న తమిళ సెల్వితో కలిసి కైలాసకోనకు వచ్చాడు. ఆమెను కొండమీద ఉన్న బావుల సమీపంలోని అటవీ ప్రాంతం వద్దకు తీసుకువెళ్లి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కూతురు కనిపించకపోవడం.. ఆమె తల్లిదండ్రులు మణ్ గండన్, పల్గీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మదన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు మదన్ చెప్పుకొచ్చాడు. ఆమెను కైలాసకోన కొండపైకి తానే హత్య చేశానని చెప్పాడు నిందితుడు చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడు ఎస్సై రమేష్ కైలాసపురంలో ప్రత్యేక బృందంతో తమిళసెల్వి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నెలరోజుల తర్వాత ఆదివారం ఉదయం కొండపై తమిళసెల్వి దుస్తులు, మెట్టెలు, పాదరక్షలు ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించారు.
