Asianet News TeluguAsianet News Telugu

ఆహారం కోసం గొడ‌వ‌.. నిద్రిస్తున్న దంపతులను హ‌త్య చేసిన‌ ప‌నిమ‌నిషి

క్రైమ్ న్యూస్: ఆహారం విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత నిద్రపోతున్న సమయంలో దంప‌తుల‌ను గొడ్డలితో దాడిచేసి ప్రాణాలు తీశాడు ఇంటి పనిమనిషి. అలాగే, వారి కుమార్తెను కూడా తీవ్రంగా గాయ‌ప‌ర్చాడు. 
 

A Jharkhand man hacked a sleeping couple to death after fighting over food
Author
First Published Sep 7, 2022, 3:07 PM IST

జార్ఖండ్: ఇంట్లో ప‌నిచేస్తున్న ఒక వ్య‌క్తి ఆహారం విష‌యంలో గొడ‌వ‌ప‌డి త‌మ య‌జ‌మానుల‌ను గొడ్డ‌లితో దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అలాగే, వారి కూతురురిపై కూడా దాడి చేశారు. ప్ర‌స్తుతం ఆమె ప్రాణాలు నిలుపుకోవ‌డానికి ఆస్ప‌త్రిలో పోరాడుతోంది. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఆహారం విషయంలో జరిగిన ఘర్షణలో 40 ఏళ్ల వ్యక్తి నిద్రలో ఉన్న జంటను గొడ్డలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. వారి కుమార్తెను తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. రైడిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజ్‌గావ్ జామ్‌తోలి గ్రామంలోని మృతుడి ఇంట్లో పనిమనిషిగా పనిచేసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు. సోమవారం అర్థరాత్రి జ‌రిగిన ఈ దాడిలో మృతుల కుమారుడు క్షేమంగా తప్పించుకోగా.. వారి కుమార్తె తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు నిందితుడిని పట్టుకునీ, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీస‌లు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మృతులు రిచర్డ్, మెలానీ మింజ్ గా గుర్తించారు. దాడిలో తీవ్ర గాయాలు కావ‌డంతో వారు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. వారి కుమార్తె తెరెసా రాంచీలోని ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. సత్యేంద్ర లక్రా అనే నిందితుడు కొన్ని రోజుల క్రితం ఆహారం విషయంలో రిచర్డ్ మింజ్‌తో గొడవ పడ్డాడని, తన యజమాని తనను హత్య చేస్తాడని మతిస్థిమితం కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు కొన్ని రోజుల క్రితం ఆహారం విషయంలో రిచర్డ్ మింజ్‌తో గొడవ పడ్డాడని, కుటుంబంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ దారుణానికి ఒడిక‌ట్ట‌డానికి ముందు నిందితుడు మ‌ద్యం సేవించిన‌ట్టు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

ఇదిలావుండగా, ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో తమ ఫ్లాట్‌ను విక్రయించే విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యను చంపి, కొడుకులపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నీరజ్ అనే వ్యక్తి తనను తాను కత్తితో పొడిచుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం నాడు చోటుచేసుకుంది. నీరజ్, అతని భార్య తరచూ గొడవ పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన పేరు మీద రిజిస్టర్ అయిన ఫ్లాట్‌ను అమ్మాలని భావించింది, కానీ నీరజ్ దానికి ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఫ్లాట్ సంబంధించి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. 

మంగ‌ళవారం రాత్రి కూడా ఫ్లాట్ విక్ర‌యం గురించి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ప్రారంభం అయింది. ఈ క్ర‌మంలోనే నీరజ్ తన భార్యను కత్తితో పొడిచాడు. అతని ఇద్దరు కుమారులను (ఒక‌రికి ఎనిమిదేండ్లు, మ‌రొక‌రికి 12 సంవ‌త్స‌రాలు) గాయ‌ప‌ర్చాడు. చిన్నారులు త‌మ త‌ల్లిపై దాడిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా పిల్ల‌ల‌పై కూడా నీర‌జ్ క‌త్తితో దాడి చేశాడు. ఆపై త‌న చేతిలో ఉన్న అదే క‌త్తిని ఉప‌యోగించుకుని తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అక్క‌డి ఫ్లాట్ నుంచి గొడ‌వ‌, పిల్ల‌ల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ చేరుకున్న పోలీసులు అక్క‌డి దృశ్యాలు చూసి షాక్ గుర‌య్యారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న మ‌హిళ‌, ఆమె భ‌ర్త‌, పిల్ల‌ల‌ను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే నీరజ్ భార్య చనిపోయిందని వైద్యుతు తెలిపారు. దాడికి పాల్ప‌డిన ఆమె భ‌ర్త నీర‌జ్ సైతం చికిత్స పొందుతూ బుధ‌వారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడ‌ని పోలీసులు తెలిపారు. కుమారులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios