Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరగొచ్చు - కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

B.K. Hariprasad : కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై తనకు సమచారం అందిందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం రక్షణ కల్పించాలని సూచించారు. 

A Godhra-style incident may happen in Karnataka - Congress leader Sanchanala's comments..ISR
Author
First Published Jan 3, 2024, 3:48 PM IST

B.K. Hariprasad : కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అయోధ్యకు వెళ్లే వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి తనకు సమచారం అందిందని చెప్పారు. వాటి ఆధారంగానే కర్ణాటకలో గోద్రా లాంటి ఘటన జరిగే అవకాశం ఉందని చెబుతున్నానని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం బాధ్యత తీసుకుని అయోధ్యకు వెళ్లే వారికి భద్రత కల్పించాలని అన్నారు. 

గులాబీ పూరేకులపై అయోధ్యరామయ్య.. రామాలయంలో ఆకట్టుకోనున్న పూలచిత్రాలు...

‘‘కర్ణాటక రాష్ట్రంలో నిఘా ఎక్కువగా ఉండాలి. ఇలాంటి పరిస్థితే గుజరాత్ లో గోద్రా ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయాలి. ఇక్కడ గోద్రా లాంటి ఘటన జరిగితే మనం చూడలేము. ఇది నా సొంత ప్రకటన. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. రామ మందిర ప్రారంభోత్సవం మతపరమైన కార్యక్రమం కాదని, ఇది రాజకీయ కార్యక్రమంగా మారిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. ‘‘అది మతపరమైన కార్యక్రమం అయితే మేమంతా హాజరయ్యేవాళ్లం. ప్రారంభోత్సవం ఏ మత గురువు చేసినది కాదు, విశ్వగురు చేస్తారు’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాగా.. ఎమ్మెల్సీ  బీకే హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బెంగళూరులో కరసేవక్ అరెస్టును ఖండిస్తూ నిరసనలో పాల్గొంటున్న మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి డీవీ సదానంద గౌడ దీనిపై మాట్లాడుతూ.. హరిప్రసాద్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

GruhaLaxmi: గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరైన వారి పరిస్థితి ఏమిటీ? రేవంత్ సర్కారు ఆదేశాలివే

అలాగే మైసూరులో బీజేపీ ఎమ్మెల్యే టి.ఎస్.శ్రీవత్స స్పందిస్తూ.. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ తాకలేరని అన్నారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించిందని చెప్పారు. కాశ్మీర్ లో ఒక్క రాయి కూడా విసరలేదని తెలిపారు. హరిప్రసాద్ మంత్రి పదవి కోసం ప్రకటన చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘హరిప్రసాద్ పేరులోనే రాముడు ఉన్నాడు. హరి అంటే రాముడు. ముస్లింలకు రూ.10 వేల కోట్లు ప్రకటించినందుకు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు’’ అని తెలిపారు. 

హరిప్రసాద్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కూడా స్పందించారు. రామ భక్తులకు శ్రీరాముడే రక్షణ కల్పిస్తాడని చెప్పారు. ‘‘మా దేవుడిని పూజించకుండా ఎవరైనా అడ్డుకుంటే రామభక్తులు మౌనంగా కూర్చోరు. వారు రంగంలోకి దిగితే కాంగ్రెస్ ను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. జనవరి 22న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా హరిప్రసాద్ ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios