మేకల విషయంలో గొడవ పడుతున్నాడని పక్కింటి వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేకల యజమాని జననాంగాలను కొరికాడు. దీంతో బాధితుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేవ్ లో జరిగిన ఈ విచిత్ర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మేకల కోసం మొదలైన గొడవ ఊహించని పరిణామానికి దారి తీసింది. ఈ వాగ్వాదంలో మేకల యజమాని ప్రైవేట్ పార్ట్స్ ను పక్కింటి వ్యక్తి కొరికాడు. దీంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు. అనంతరం హాస్పిటల్ కు తరలిస్తే డాక్టర్లు నాలుగు కుట్లు వేశారు. ఈ ఘటనపై బాధితుడు, నిందితుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర ఘటన యూపీలోని షాజహాన్ పూర్ లోని రోజా ప్రాంతంలో చోటు చేసుకుంది. 

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. షాజహాన్ పూర్ లోని రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి జీవిస్తున్నాడు. ఆయనకు కొన్ని మేకలు ఉన్నాయి. అయితే ఈ మేకల విషయంలో అతడు తన పొరిగింట్లో ఉన్న గంగారాం సింగ్ తో ఆదివారం రాత్రి గొడవపడ్డాడు. దీంతో అతడు కోపంతో మేకల యజమానిని కిందకి తోసేశాడు. అనంతరం జననాంగాలను గట్టిగా కొరికాడు. ఈ నొప్పి భరించలేక బాధితుడు స్పృహ కోల్పోయాడు. తరువాత బాధితుడిని స్థానికులు షాజహాన్ పూర్ సిటీలని ఓ హాస్పిటల్ లోని చేర్పించారు. 

‘‘ఈ ఘటనపై నేను పోలీసులను ఆవ్రయించాను. కానీ వారు మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు. నొప్పి చాలా ఎక్కువగా ఉంది. బాధగా అనిపిస్తోంది. ఈ గాయం సాధారణ వైవాహిక జీవితాన్ని గడిపే నా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నాకు భయంగా ఉంది’’ అని బాధితుడు తెలిపారు. 

కాగా.. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు, మెడికల్ రిపోర్టును పరిశీలించిన అనంతరం నిందితుడు గంగారాంపై ఐపీసీ సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రోజా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో అమిత్ పాండే తెలిపారు. 

బాధితుడికి హాస్పిటల్ లో ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ చికిత్స అందించారు. గాయాలు బాహ్యంగా ఉన్నాయని, అంతర్గత సిరలకు ఎలాంటి నష్టమూ జరగలేదని ఆయన చెప్పారు. బాధితుడు కాలక్రమేణా కోలుకొని సాధారణ జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై క్లినికల్ సైకాలజిస్ట్ శైలేష్ శర్మ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక సైకోపాత్ చర్య. రెండేళ్ల క్రితం బరేలీలోని డియోరానియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. తమ చిరాకును వెళ్లగక్కేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిని పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొచ్చి, వారి మానసిక పరిస్థితిని పరీక్షించాలి’’ అని చెప్పారు.