ఒక అడవి పంది మహిళా ఆటోడ్రైవర్‌ ప్రాణాలను తీసింది. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా మంగళం డ్యామ్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  

ఒక అడవి పంది మహిళా ఆటోడ్రైవర్‌ ప్రాణాలను తీసింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని మంగళం డ్యామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బుధవారం 37 ఏళ్ల మహిళా డ్రైవర్ తన ఆటోరిక్షాలో వెళ్తుండగా.. ఆకస్మాత్తుగా ఓ అడవి పంది వచ్చి.. ఆటోని ఢీకొనడంతో ఘోరా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడింది.చిక్సిత పొందుతూ మరణించింది. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. 37 ఏండ్ల విజీష సోనియా తన ఆటోలో నలుగురు స్కూల్‌ పిల్లలతో బుధవారం ఒడంతోడు-మంగళం డ్యామ్‌ రోడ్‌లో వెళ్తుంది. ఆకస్మత్తుగా ఓ అడవి పంది అడ్డు వచ్చి ఆమె వాహనాన్ని వేగంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తాపడి మహిళ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు వెంటనే 
ఒక ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో ఆటోలోని స్కూల్‌ పిల్లలకు స్వల్పంగా గాయపడ్డారు.

 ఒడమతోడు-మంగళం ఆనకట్ట రోడ్డులో ఉదయం 8 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్న నలుగురు పాఠశాల విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. విజేషా సోనియా నడుపుతున్న త్రీవీలర్ వేగంగా వచ్చిన అడవిపందిని ఢీకొట్టడంతో బోల్తా పడి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోరిక్షాలో నలుగురు పిల్లలతో పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహిళను సమీపంలోని నెన్మారాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమెను రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు.