Asianet News TeluguAsianet News Telugu

నోయిడాలో ఢిల్లీ తరహా యాక్సిడెంట్.. స్విగ్గి డెలివరీ బాయ్ ను ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..

నోయిడాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఓ స్విగ్గి డెలివరీ బాయ్ ను కారు ఢీకొట్టింది. అతడిని 500 మీటర్ల దూరం లాక్కెళ్లింది. దీంతో బాధితుడు మరణించాడు. 

A Delhi-style accident in Noida.. A car hit a Swiggy delivery boy and dragged him for 500 meters..
Author
First Published Jan 5, 2023, 9:07 AM IST

ఢిల్లీలోని సుల్తాన్‌పురి చోటు చేసుకున్న దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ భయంకరమైన ఘటనను ఇంకా ఎవరూ మరచిపోకముందే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ ను ఓ కారు ఢీకొట్టింది. అలాగే 500 మీటర్లు అతడిని ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు.

ఇంటిముందు మూత్ర విసర్జన.. వద్దన్నందుకు తుపాకీతో కాల్పులు..ఒకరు మృతి...

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీలో కౌశల్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆయన ఎటావాలో నివసిస్తున్నాడు. అయితే న్యూ ఇయర్ రోజు రాత్రి ఓ ఆర్డర్ రావడంతో ఫుడ్ డెలివరీ చేయడానికి నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ పై తన బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు అతడి బైక్ ను ఢీకొట్టింది. అతడు కింద పడిపోగానే కారు ఆపకుండా దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది.

అయితే ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు కౌశల్ సోదరుడు అమిత్ అతడికి ఫోన్ చేశాడు. కానీ బాధితుడు అప్పటికే మరణించడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అయితే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడు. దీంతో అమిత్ పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం.. చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు

సుల్తాన్‌పురి ఘటన మరవకముందే..
ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలి సింగ్ మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంజలి సింగ్ స్కూటీని జనవరి 1 తెల్లవారుజామున ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె వాహనం కింద ఇరుక్కుపోయింది. ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురి నుండి కంఝవాలా వరకు సుమారు 13 కిలోమీటర్లు ఒక గంటకు పైగా ఆమెను కారు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఆమె శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. బట్టలన్నీ చిరిగిపోయాయి. 

ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అమిత్ షా విమానం.. అసలేం జరిగిందంటే..?

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. అందులో ఉన్న ఐదుగురు నిందితులను సోమవారం మూడు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios