Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం.. చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా కోర్టులో బుధవారం జనవరి 4న పోలీసులు ఈ ఛార్జిషీటును దాఖలు చేశారు. ఛార్జిషీటు 152 పేజీలుగా ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి.

Cyrus Mistry Car Crash Maharashtra Police File Charge Sheet In Palghar Court
Author
First Published Jan 5, 2023, 5:21 AM IST

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసు: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. తాజాగా సైరస్ మిస్త్రీ మృతిపై పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  ఈ కేసులో ప్రముఖ ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోలే (55)పై పాల్ఘర్ పోలీసులు బుధవారం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 152 పేజీల చార్జిషీటును కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

సెప్టెంబరు 4న కారు ప్రమాదం

సుమారు 4 నెలల క్రితం..టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ , అతని స్నేహితుడు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సైరస్ మిస్త్రీ వయసు 54 ఏళ్లు.  ఆయన  చిన్న వయసులోనే దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు గతేడాది సెప్టెంబర్ 4న ముంబై-అహ్మదాబాద్ హైవే గుండా వెళుతుండగా సూర్య నదిపై నిర్మించిన డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైంది.

ఆ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు, భాగస్వామి జహంగీర్ పండోల్ మరణించారు. కాగా.. కారు నడుపుతున్న అనహిత పండోల్,  డారియస్ పండోల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పాల్ఘర్ జిల్లా దేహా పోలీసులు  నవంబర్ 5 , 2022 న  భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 304-A, 279,337  కింద కేసు నమోదు చేశారు. పోలీసులు పలువురు సాక్షులను విచారించారు. ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO), మెర్సిడెస్ బెంజ్ ఇండియా-పుణె నుండి నివేదికలు కూడా తీసుకున్నారు.

అతి వేగమే ప్రమాదానికి కారణం 

పలువురు సాక్షులను కూడా పోలీసులు విచారించారు. ఈ కేసులో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు గతంలోనే చెప్పారు. ప్రాథమికంగా కారు అతివేగం, డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. అనాహిత పండోలే కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనహిత పండోల్ గైనకాలజిస్ట్‌గా ప్రత్యేకత పొందారు.

ముంబైలోని ఓ ఆసుపత్రిలో 108 రోజుల పాటు చికిత్స పొందిన ఆమె డిసెంబర్ నెలలో డిశ్చార్జ్ అయ్యారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. కారులో తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. ముందు సీటులో కూర్చున్న వారు కూడా వెనుక కూర్చున్న వారందరూ సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios