పరీక్షలో మార్కులు తక్కువ వేశారని టీచర్ ను కట్టేసి కొట్టిన స్టూడెంట్లపై కేసు నమోదు అయ్యింది. జార్ఖండ్ లో జరిగిన ఈ ఘటనలో 11 మంది స్టూడెంట్లు మరో ఇద్దరు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జార్ఖండ్ లో తొమ్మిదో తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయ్యామని ఓ టీచర్ ను స్టూడెంట్లు కొట్టిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఇప్పుడు పోలీసు కేసు నమోదు అయ్యింది. 11 మంది విద్యార్థులు, మరో ఇద్దరు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నాడు ప్రధాని మోడీ టీ అమ్మిన వాద్ నగర్.. నేడు ‘ఆదర్శ్ రైల్వే స్టేషన్’గా ప్రకటన..
జార్ఖండ్ దుమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రాక్టికల్ మార్కులను ఫైనల్ స్కోర్‌లో చేర్చకపోవడంతో టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మాథ్స్ టీచర్ గా పని చేస్తున్న సుమన్ కుమార్ అనే వ్యక్తిపై ఈ దాడి జరిగింది. ఇటీవల జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ ( జేఏసీ) విడుదల చేసిన ఫలితాల్లో ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 32 మంది విద్యార్థుల్లో 11 మంది గ్రేడ్-డిడి పొంది.. ఫెయిల్ అయ్యారు. తమకు ప్రాక్టికల్స్ లో లెక్కల మాస్టారు తక్కువ మార్కులు వేశాడని విద్యార్థులు ఆగ్రహం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న లెక్కాల మాస్టారు సుమన్ కుమార్ పై విద్యార్థులంతా మూక్ముడిగా దాడి చేశారు. విచక్షణరహితంగా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ దాడిని గమనించిన వచ్చిన ఆ పాఠశాల క్లర్క్ ను కూడా వదలేదు. ఆయన కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఈ ఘటనును వారు వీడియో కూడా తీశారు. ఆ టీచర్ ను, సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. అందులో కొందరు పిల్లలు.. తాము ఏం చేస్తున్నామో అందరికీ తెలిసేలా వైరల్ చేయాలని గట్టిగా అరుస్టున్నారు. కొంత సమయం తరువాత వారిద్దరినీ స్టూడెంట్లు వదిలేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. అయితే మంగళవారం ఉపాధ్యాయుడు కుమార్ సుమన్, క్లర్క్ సోనారామ్ చౌరే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘‘ ప్రిన్సిపాల్ రామ్‌దేవ్ ప్రసాద్ కేశరి పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ఈ ఘటన అతడి ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ’’ అని పోలీసు ఆఫీసర్ నిత్యానంద్ భోక్తా చెప్పారు.
ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సురేంద్ర హెంబ్రోమ్ మాట్లాడుతూ.. ప్రాక్టికల్ పరీక్షల్లో తమకు చాలా తక్కువ మార్కులు స్టూడెంట్లు చెప్పారని, ఈ విషయంలో ఉపాధ్యాయుల నుంచి స్పందన రాకపోవడంతో ఇలాంటి చర్యకు పాల్పడినట్టు వారు తెలిపారని పేర్కొన్నారు.
