Asianet News TeluguAsianet News Telugu

నాలుగు పెళ్లిళ్లు, ఏడుగురు సంతానం.. రహస్యంగా ఐదో పెళ్లికి సిద్దం.. తండ్రిని చితకబాదిన రెండో భార్య, పిల్లలు....

ఏడుగురు పిల్లలు, నలుగురు భార్యలున్న ఓ వ్యక్తి రహస్యంగా ఐదోపెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన రెండో భార్య, పిల్లలు అతడిని వివాహవేదికలోనే చితకబాది పోలీసులకు అప్పగించారు. 

father of seven children was going to become a groom for the 5th time in uttarpradesh
Author
First Published Sep 1, 2022, 8:43 AM IST

ఉత్తర ప్రదేశ్ :  ఆ వ్యక్తికి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ మరో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతని రెండో భార్య, ఏడుగురు పిల్లలు, బంధువులు వివాహాన్ని అడ్డుకున్నారు. భార్య, పిల్లలు పెళ్లి కుమారుడిగా ముస్తాబు అయిన అతడిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన వధువు అక్కడినుంచి భయపడి పారిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది.

యూపీలోని మొహల్ల పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్లు. అతడికి గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఏడుగురు సంతానం కలిగారు. అయితే గత ఆరు నెలల నుంచి రెండో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెకు సైతం విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన కూతురే చెప్పుకొచ్చింది. అయితే మంగళవారం రాత్రి రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 

ఇంతలో ఈ సమాచారం తన రెండో భార్య, పిల్లల చెవిన పడటంతో వారు పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి బంధువులతో సహా వచ్చి అడ్డుపడ్డారు. అతడిపై దాడి చేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

కన్నకూతురిపై అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. శిశువును కాలువలోకి విసిరేస్తూ పట్టుబడ్డ తండ్రి...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ జులైలో వెలుగులోకి వచ్చింది.  ఒకే కాలనీలో ముగ్గురు భార్యలు.. పక్కపక్కవీధుల్లో ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం...మొత్తం ఏడు పెళ్లిళ్లు...అది కూడా విడాకులు తీసుకుని.. ఉద్యోగాలు చేస్తూ.. బాగా చదువుకున్న.. రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న మహిళలే టార్గెట్.. ఇంకేముంది.. నకిలీ విడాకుల పత్రాలు, పే స్లిప్ లతో మోసం చేశాడు. మొత్తంగా ఏడుగిరిని పెళ్లాడి.. ఇప్పుడు ఇంకో మహిళతో పరారీలో ఉన్నాడు. ఈ మేరకు అతని ఇద్దరి భార్యలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో అతనిమీద ప్రెస్ మీట్ పెట్టారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు ఇంజనీరింగ్ చదివాడు. మ్యాట్రిమోనీ సైట్ లో రెండో పెళ్లి కోసం పేరు నమోదు చేసుకున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న మహిళలను సంప్రదించేవాడు. తనకు వివాహం అయి విడాకులు తీసుకున్నానని నకిలీ డైవోర్స్ పేపర్స్ చూపించి వారిని నమ్మించాడు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగిని, దాదాపు రెండు లక్షల దాకా జీతం వస్తుందని పేస్లిప్ చూపించాడు. 

ఇవన్నీ నమ్మిన ఆ మహిళ కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి జరిపించారు. వెంటనే అతడు భార్య ఉద్యోగం మాన్పించేశాడు. ‘ప్రాజెక్టు పనిమీద అమెరికా పంపుతున్నారు. ఇద్దరం వెళ్దాం అని చెప్పి పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. దీని కోసం డబ్బు అవసరమని భార్య నుంచి అత్తింటిలో అందరి నుంచి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. తరువాత అమెరికా ప్రయాణం వాయిదా పడింది అని చెప్పి ఎప్పటిలాగే గడిపేవాడు. ఇచ్చిన డబ్బులు అత్తింటివారు అడగగా రేపు, మాపు అంటూ రోజులు గడిపాడు. 

గట్టిగా అడిగేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసుకోమన్నాడు. దీంతో బాధిత మహిళా మెదక్ జిల్లా రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించగా వారు శివశంకర్ బాబు పిలిపించారు. ఆ సమయంలో మరో మహిళతో ఠాణాకు వచ్చిన అతను ఈమె తన భార్య అని చెప్పాడు. డబ్బు ఇచ్చే భరోసా తమదేనని చెప్పాడు. ఆమెను మధ్యవర్తిగా ఉంచాడు. భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరో మహిళను భార్య.. అని చెప్పడం అనుమానం రావడంతో ఆ ఇద్దరు మహిళలు తర్వాత మాట్లాడుకున్నారు.  ఇద్దరిని ఒకేలా మోసం చేసినట్లు, ఇద్దరికీ ఒకేలా చెప్పి లక్షల్లో డబ్బులు గుంజినట్లు గుర్తించారు. 

ఈ క్రమంలో రెండో మహిళ తన తమ్ముళ్లకు చెప్పి అతని మీద నిఘా పెట్టించడంతో.. ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయం నిలదీయడంతో తర్వాత అతను కనిపించడం మానేసాడు. ఈ ఇద్దరూ కలిసి మరిన్ని వివరాలు ఆరా తీయగా తమతో కలిసి మొత్తం ఏడుగురిని అతను పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. తొలి వివాహం వారి గ్రామంలోనే 2018 లో జరిగింది.  తర్వాత నెలల వ్యవధిలోనే మరో మహిళను వివాహం చేసుకుంటూ వచ్చాడు. 

చివరిగా గత ఏప్రిల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి పరారీలో ఉన్నాడు. అతడి మోసాలపై కేపీహెచ్బీ ఠాణాలో 2019లో ఒకరు, 2021లో మరొకరు, ఆర్ సి పురం, గచ్చిబౌలి, అనంతపురం, ఎస్ ఆర్ నగర్ ఠాణాలలో వేరు వేరు మహిళలు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు తమకు దగ్గరి బంధువు అని, బీజేపీ నేత శ్రీకాంత్ సన్నిహితుడని.. వారి అండ ఉందని శివశంకర్ బాబు తరచూప్రస్తావించేవాడనివారు చెప్పారు. నిజంగా వారికి సంబంధాలు ఉంటే అతని నిజ స్వరూపం గ్రహించి దూరంగా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios