Asianet News TeluguAsianet News Telugu

కూతురు మొద‌టి పుట్టిన రోజు సంద‌ర్భంగా 1.01 లక్షల పానీపూరీల‌ను ఫ్రీగా పంచిపెట్టిన వ్యాపారి..

ఆడపిల్లలు భారం కాదని, వారిని కూడా మగపిల్లలతో సమానంగా పెంచాలనే ఉద్దేశాన్ని చాటి చెబుతూ ఓ వ్యాపారి ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. తన కూతురు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా 1.01 లక్షల పాేనీ పూరీలను ఉచితంగా పంచిపెట్టారు. 

A businessman distributed 1.01 lakh panipuris for free on the occasion of his daughter's first birthday.
Author
First Published Aug 19, 2022, 2:14 PM IST

తన కుమార్తెకు ఏడాది నిండింద‌ని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ వ్యాపారి  1.01 లక్షల పానీపూరీల‌ను  ఫ్రీగా పంచిపెట్టారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ క్యాంపెయిన్ లో భాగంగా కోలార్‌లో ఒక పానీ పూరీ విక్రేత అయిన అంచల్ గుప్తా బంజరీ మైదాన్‌లో పెద్ద టెంట్ లో 21 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 

తల్లి పాలు తాగడం మానేసిన 8 నెలల పిల్లాడు.. ఎక్స్‌ రే తీస్తే షాకింగ్ విషయం వెలుగులోకి

తన బిడ్డ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని పానీ పూరీలు తినాల‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ఉద‌యం 2 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌ర‌కు జ‌రిగిన ఈ వేడుక‌కు ఎంతో మంది హాజ‌రై ఆంచ‌ల్ గుప్తా ఇచ్చిన విందును స్వీక‌రించారు. సమాజంలో ఆడపిల్లలను రక్షించాలనే సందేశాన్ని ఇచ్చారు. 

 

ఆడపిల్లలను చదివించాల్సిన అవసరాన్ని స‌మాజంలోకి పంప‌డ‌మే లక్ష్యంగా ఈ వేడుక‌లు నిర్వ‌హించామ‌ని, దీనికి అయిన ఖ‌ర్చు విష‌యాన్ని పట్టించుకోలేద‌ని గుప్తా చెప్పారు. సమాజంలోని వ్యక్తులు ఆడపిల్లలను భారంగా భావించకూడ‌ద‌ని అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల‌ని చెప్పారు.

 

కాగా.. కూతురు పుట్టిన వెంట‌నే అంచల్ గుప్తా 50 వేల పానీపూరీల‌ను ఉచితంగా పంచిపెట్టారు. ఫస్ట్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా దానికి రెట్టింపు సంఖ్య‌లో పానీపారీల‌ను పంచిపెట్టి వేడుక‌ను చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ హాజ‌ర‌య్యారు. అంచ‌ల్ గుప్తా చేప‌ట్టిన ఈ క్యాంపెయిన్ ను అభినందించారు. మధ్య‌ప్ర‌దేశ్ ఎంపీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్య‌క్ర‌మాన్ని ట్వీట్ చేసి ప్ర‌శంస‌లు కురిపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios