స్నేహితుడి పుట్టిన రోజు వేడుకను సంతోషంగా జరుపుకుని వారంతా ఇళ్ళకు బయలుదేరారు. అయితే ఈ సంతోషం వారిలో ఎంతోసేపు నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబలించివేసింది. ఈ విషాద సంఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ స్నేహితుల బృందం ఓ స్పేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోడానికి కోలాన్ డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన వారు స్నేహితుడితో కేక్ కట్ చేయించి ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకను ముగించుకుని వచ్చిన కారులోనే తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వీరు ప్రయాణించిన కారు ప్రమాదానికి గురయ్యింది. సెహూర్ ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డ్యామ్ లో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృత్యువాతపడ్డారు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. కారును బైటికి తీసి అందులో చిక్కుకున్న ఆరు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 24, 2018, 5:43 PM IST