యూజర్ల డేటా లీక్: జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ కమిటి సిఫారసులు

A 77-year-old former Supreme Court judge has Google and Amazon very tense
Highlights

యూజర్ల డేటా ఇక భద్రమేనా?


న్యూఢిల్లీ:  డేటా గోప్యత అంశంపై మాజీ సుప్రీం కోర్టు జడ్జి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో కొత్త డేటా గోప్యత చట్టాలను రూపొందించేందుకు సిద్దమౌతున్నారు.
సమాచార పరిరక్షణకు ఉద్దేశించిన నియమాలు, నిబంధనలనను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికకను కేంద్రానికి సమర్పించనుంది.ఇటీవల ఫేస్ బుక్ లక్షలాది మంది యూజర్ల డేటాను లీక్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ప్రతిపాదనలకు ప్రాధాన్యత చేకూరింది.


జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ  ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది.

 శ్రీకృష్ణ  కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్‌ పెట్టనున్నాయని భావిస్తున్నారు.   వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం,  డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కఠిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. 

loader