మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో నిర్వహించిన రామనవమి ఊరేగింపు సందర్భంగా మతపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ నష్టపరిహారం చెల్లించాలని 12 ఏళ్ల బాలుడికి అధికారులు నోటీసులు పంపించారు. 

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడికి నష్టపరిహారం కింద రూ.2.9 లక్షల జరిమానా చెల్లించాలని నోటీసులు అందాయి. దీంతో ఆ బాలుడు తనను ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో బతుకుతున్నాడని పలు మీడియా సంస్థలు నివేదించాయి. కూలీగా పని చేసే బాలుడి తండ్రి అయిన కాలు ఖాన్ ను కూడా క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 4.8 లక్షల జరిమానా చెల్లించాలని కోరింది.

ఈ నోటీసులతో గతేడాది డిసెంబర్ లో అమలులోకి వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ మళ్లీ మధ్యప్రదేశ్ లో చర్చకు దారి తీసింది. దీని ప్రకారం ఏవైనా నిరసనలు, సమ్మెలు, హింసాకాండ జరిగినప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఉద్దేశపూర్వకంగా నష్టం వాటిల్లితే దానిని పూడ్చడానికి కారకుల నుంచి ఆ నష్టపరిహారాన్ని వసూలు చేయవచ్చు. తాజా కేసులో ఆ చట్టం కిందనే నోటీసులు జారీ అయ్యాయి. 

రసగుల్లా, బికానేరి భుజియాలను వెన్నక్కి నెట్టిన హైదరాబాదీ హలీం.. మోస్ట్ పాపులర్ జీఐ అవార్డు సొంతం..

ఖాన్ పొరుగువారి ఫిర్యాదు మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 10వ తేదీన నగరంలో జరిగిన రామనవమి ఊరేగింపులో ఒక గుంపు విధ్వంసం చేసిందని, దీంతో తన ఆస్తికి నష్టం జరిగిందని ఓ మహిళ ఆరోపించింది. అందులో ఈ 12 ఏళ్ల బాలుడి ప్రమేయం ఉందని ఫిర్యాదు చేసింది. 

దీంతో అధికారులు బాలుడికి తాజా చట్టం కింద నోటీసులు పంపించారు. అందులో బాలుడికి 12 సంవత్సరాల వయస్సు అని అని స్పష్టంగా పేర్కొన్నారు. రూ. 2.9 లక్షల నష్టానికి అతనే బాధ్యుడని పేర్కొంది. బాలుడితో పాటు బాలుడి తండ్రితో పాటు మరో ఏడుగురికి కూడా ఇలాంటి నోటీసులు జారీ చేశారు.

కాగా.. నోటీసును రద్దు చేయాలని కోరుతూ బాలుడి కుటుంబం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్లో అప్పీల్ చేసింది. అయితే సెప్టెంబరు 12న, పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం నివారణ మరియు రికవరీ చట్టం కింద ఏర్పాటైన ట్రిబ్యునల్లో ఏదైనా అభ్యంతరం చెప్పాలని కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

టపాసు కాల్చి... కింద పడి ముఖం పగలకొట్టుకున్న ఎమ్మెల్యే.. వైరల్ వీడియో..!

ఈ విషయంలో బాలుడు తండ్రి కాలు ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు మైనర్. అల్లర్లు జరిగినప్పుడు మేము నిద్రపోతున్నాము. మాకు న్యాయం కావాలి’’ అని ఆయన అన్నారు. ఆయన భార్య మాట్లాడుతూ.. తనను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తన కొడుకు చాలా ఆందోళనకు గురి అవుతున్నారని తెలిపారు.

అధికారులు తీసుకున్న ఈ చర్యపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసద్దుదీన్ ఒవైసీ స్పందిస్తూ.. వారికి (యంత్రాంగం) ముస్లింల పట్ల చాలా ద్వేషం ఉందని, ఇప్పుడు వారు పిల్లలను కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు. ‘‘మధ్యప్రదేశ్ చట్టం ప్రకారం 12 ఏళ్ల చిన్నారి దోషిగా నిలబడ్డాడు. అయితే జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం పిల్లవాడు ఉద్దేశపూరితంగా ఘటనకు పాల్పడలేదని భావించాలి. కానీ వారు ముస్లింలను చాలా ద్వేషిస్తున్నారు. పిల్లల నుంచి కూడా రికవరీ తీసుకుంటారా? ’’ అని ఒవైసీ హిందీలో ట్వీట్ చేశారు.

థరూర్ వర్సెస్ ఖర్గే.. సోనియా గాంధీ తరువాత సీటును అధిష్టించేదెవరు ? నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు..

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదనీ ఖర్గోన్ జిల్లాలో రామనవమి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణలు చెలరేగాయి. ఘర్షణలు హింసకు దారితీశాయి. కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో వెంటనే కర్ఫ్యూ విధించారు. ఈ ఘటన ఆ సమయంలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ మత ఘర్షణల తరువాత.. దీనిపై 60కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. 170 మందిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం 50కి పైగా ఇళ్లు, దుకాణాలు, భవనాలను కూల్చివేసింది.