- Home
- National
- రసగుల్లా, బికానేరి భుజియాలను వెన్నక్కి నెట్టిన హైదరాబాదీ హలీం.. మోస్ట్ పాపులర్ జీఐ అవార్డు సొంతం..
రసగుల్లా, బికానేరి భుజియాలను వెన్నక్కి నెట్టిన హైదరాబాదీ హలీం.. మోస్ట్ పాపులర్ జీఐ అవార్డు సొంతం..
రంజాన్ సీజన్ వస్తే చాలు.. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ఎక్కువగా తినే ఆహార పదార్థాల్లో హలీం ఒక్కటి. అందులో హైదరాబాదీ హలీం టేస్ట్ గురించి మాటల్లో అస్సలు చెప్పలేమబ్బా.. జనాలను మెచ్చిన ఈ హలీం కు తాజాగా ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది తెలుసా..

hyderabadi haleem
హలీం అనగానే చాలు మన కళ్ల ముందు మెదుల్తుంది. ఇక అది తింటుంటే వచ్చే ఆ మజాను మాటల్లో అసలే చెప్పలేం. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోయే చికెన్, మటన్ హలీంలను టేస్ట్ చేయని వారు తక్కువ మందే ఉండి ఉంటారు. ఈ హలీం రంజాన్ సీజన్ లోనే ఉంటుంది. అందుకే ఆ సమయం దాటితే మళ్లీ ఇది దొరకదని ఎక్కడెక్కడి ఊరివాళ్లందరూ హైదారాబాద్ కు వెళ్లి మరీ తింటుంటారు. అది హైదరాబాదీ హలీం కు ఉన్న స్పెషాలిటీ. అయితే ఈ హలీం ఒక్క రంజాన్ మాసంలోనే కాదు.. హైదారాబాద్ లో కొన్ని చోట్ల ఏడాది పొడవునా దొరుకుతుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇతర ప్లేస్ లల్లో కంటే హైదారాబాదీ హలీం కే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఎందుకో తెలుసా.. ఇక్కడి హలీం టేస్ట్ లో ది బెస్ట్. జనాలు మెచ్చిన ఈ హలీం కు ఓ అరుదైన గౌరవం కూడా దక్కింది.
hyderabadi haleem
ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ‘మోస్ట్ పాపులర్ జీఐ’ అవార్డుల ఫలితాలు ప్రకటించారు. అందులో హైదారాబాదీ హలీం యే విజేతగా నిలిచింది. ఈ అవార్డును వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పీయుష్ గోయల్ ‘పిస్తా హౌస్ ’ డైరెక్టర్, ‘హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ఎం.ఎ. మజీద్ కు అందజేశారు.
hyderabadi haleem
రసగుల్లా, రత్లామి సెవ్, బికనేరి భుజియా జీఐ గుర్తింపు ఉన్న17 ప్రసిద్ధ వంటకాలు కూడా దీనిలో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ వెనక్కి నెట్టేసి హైదారాబాద్ హలీం యే అత్యంత ప్రసిద్ధి పొందిన జీఐ గా అవార్డును సొంతం చేసుకుంది.
Image Credit: Getty Images
అయితే ఈ అవార్డులు ప్రజాభిప్రాయం ఆధారంగా ఉంటాయి. దీనికోసం ఆగస్టు 2 నుంచి అక్టోబర్ 9 వరకు వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ వంటకాన్ని ఎంపిక చేయడానికి ఈ ఓటింగ్ ను నిర్వహించింది. ఈ ఓటింగ్ లో భారతీయులే కాదు.. విదేశీయులు కూడా పాల్గొన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది హైదరాబాదీ హలీం కే ఓటేశారు.
హైదారాబాదీ హలీం కు 2010 లోనే (జీఐ) జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదా దక్కింది. 2019 లోనే ఈ గడువు ముగిసింది. కాగా అప్పుడే దీన్ని రెన్యువల్ చేసారు. అంటే ఈ గుర్తింపు 2019 నుంచి 10 ఏండ్ల వరకు ఉంటుంది.