రేపో మాపో పోయే వయసులో ఇదేం పాడు బుద్ధి

99-yr-old retired principal sexually assault 10-yr-old girl in Chennai
Highlights

ఒకరు తప్పు చేస్తుంటే చెప్పాల్సిన వయసులో ఉండి.. తన వక్ర బుద్ధిని బయటపెట్టాడో ప్రబుద్ధుడు. వరసకు మునిమనవరాలు వయసుగల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలు పాలయ్యాడు. 

వయసు పెరగగానే సరిపోదు.. ఆ వయసుతోపాటు బుద్ధి కూడా పెరగాలి. ఒకరు తప్పు చేస్తుంటే చెప్పాల్సిన వయసులో ఉండి.. తన వక్ర బుద్ధిని బయటపెట్టాడో ప్రబుద్ధుడు. వరసకు మునిమనవరాలు వయసుగల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలు పాలయ్యాడు. ఈ దారుణ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  పరశురామన్(99).. ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు.  అతను తన ఇంటికి సమీపంలో మరో ఐదు ఇళ్లను నిర్మించి వాటిని అద్దెకు ఇచ్చాడు. వాటిల్లో ఒక ఇంట్లో ఓ కుటుంబం  రెండేళ్లుగా నివసిస్తోంది. వారికి 10 ఏళ్ల కుమార్తె ఉంది.

అయితే.. ఆ పదేళ్ల బాలిక సెడన్ గా తనకు కడుపులో నొప్పి వస్తోందన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే.. స్కూల్ లో పాప ఏదైనా తిన్నదేమోననే విషయాన్ని ఆరా తీయగా.. బాలిక చెప్పిన విషయాలను తల్లిదండ్రులను విస్తుపోయేలా చేశాయి.

పరశురామన్.. తన ప్రైవేట్ పార్ట్స్ ని బాలిక నోట్లో పెట్టి.. లైంగికంగా హింసించినట్లు తేలింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారించారు.

కాగా.. తాను ఆ తప్పు చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు పరశురామ్ కి ఏడుగురు సంతానం. అతను లైంగికంగా హించిన బాలిక వయసు.. పరశురామ్ మునిమనవరాలు వయసు ఉండటం గమనార్హం. 
 

loader