Coronavirus:పెరుగుతున్న కరోనా కొత్త కేసులు.. 11.6 శాతం అధికం

Coronavirus: భారత్ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారంతో పోలిస్తే గురువారం కొత్త కేసుల్లో 11.6 శాతం పెరుగుదల నమోదైంది.
 

9419 Fresh Covid Cases In India, 11.6% Higher Than Yesterday

Coronavirus: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో దేశంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వాలు దీని కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఇదే సమయంలో కొత్తగా కోవిడ్-19 బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిస్తోంది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,419 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం కొత్త కేసుల్లో 11.6 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో మొత్త కరోనా కేసుల సంఖ్య 3,46,66,341కి చేరింది. ఇదే సమయంలో 8,251 మంది కోలుకున్నారు. దీంతో మొత్త కరోనా రికవరీల సంఖ్య 3,40,97,388కి పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం లక్ష దిగువనే ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 94,742 తగ్గింది. 

Also Read: Omicron Variant: మహారాష్ట్రలో కోలుకున్న ‘ఒమిక్రాన్‌’ బాధితుడు

ఇదిలావుండగా, గత 24 గంటల్లో 159 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కొత్త నమోదైన మరణాల్లో అధికంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ కారణంగా మొత్తం 4,74,111 మంది చనిపోయారు. కరోనా మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.  కోవిడ్-19 రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కరోనా పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 65,19,50,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 12,89,983 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.  అలాగే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 130.4 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.  ఇందులో మొదటి డోసులు 80.7 కోట్లు ఉన్నాయి. రెండు డోసులు తీసుకున్నవారు 49.6 కోట్ల మంది ఉన్నారు.  

Also Read: Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి.. యుద్ధవీరుడి జీవిత విశేషాలు..

 ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరల్డో మీటర్ కరోనా వైరస్ డాష్ బోర్డు వివరాల ప్రకారం.. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 268,149,536 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,295,841 మంది వైరస్ కారణంగా చనిపోయారు. కోవిడ్-19 బారినపడ్డవారిలో 241,358,840 మంది కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ దేశాలు టాప్ లో ఉన్నాయి. 

Also Read: Framers Protest: తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. రైతులకు కేంద్రం కొత్త ఆఫర్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios