మహారాష్ట్ర నాగ్‌పూర్ సోలార్ కంపెనీలో పేలుడు: తొమ్మిది మంది మృతి

మహారాష్ట్ర నాగ్‌పూర్ లోని సోలార్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో  ఇవాళ జరిగిన పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో  9 మంది మరణించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

9 dead in blast at explosives solar company in Maharashtras Nagpur lns

ముంబై: మహారాష్ట్ర నాగ్‌పూర్ లోని సోలార్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఆదివారంనాడు జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందారు.నాగ్ పూర్  బజార్ గావ్  గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ లో పేలుడు జరిగింది.  ఇవాళ ఉదయం  కంపెనీలోని కాస్ట్ బూస్టర్ యూనిట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఈ పేలుడులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు  సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు.  ప్రమాదస్థలిని  అధికారులు పరిశీలించారు.  ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి  రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాాను ప్రభుత్వం ప్రకటించింది.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  నాగ్ పూర్ కలెక్టర్ డాక్టర్ విపిన్ ఇటాంకర్, నాగ్ ‌పూర్  రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios