మహారాష్ట్రరలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఇక్కడ 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, తొమ్మిది మంది ఈ వైరస్‌తో ప్రాణాలు వదిలారు. దీంతో ఈ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,421 ఉన్నాయి. 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. అక్కడ ఒకే రోజులో 1,115 కరోనా వైరస్ కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. అలాగే, 9 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ మేరకు ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ కేసులు గణనీయంగా రిపోర్ట్ అవుతున్నాయి. ముంబయిలో 320 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా వైరస్‌తో మరణించారు. ఇక్కడ 14.57 శాతంగా పాజిటివిటీ రేటు ఉన్నది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 5,421 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ముంబయిలో 1,577 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 81,52,291 కేసులు నమోదయ్యాయి. 1,48,470 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మరణాల్లో ముంబయిలోనే 19,752 కరోనా మరణాలు ఉన్నాయి.

Also Read: కారేప‌ల్లి ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం..

నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 919 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ కేసులు మరో పది, 12 రోజుల వరకు పెరుగుతాయని, ఆ తర్వాత మళ్లీ తగ్గుముఖం పడుతాయని నిపుణులు చెబుతున్నారు.