Asianet News TeluguAsianet News Telugu

78 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఖాళీలు: జితేంద్ర సింగ్

New Delhi: 78 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగ‌ ఖాళీలు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రైల్వేలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం మంత్రిత్వ శాఖల్లో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
 

9.79 lakh vacancies in 78 central government ministries and departments: Jitendra Singh
Author
First Published Feb 3, 2023, 12:22 PM IST

Parliament Budget Session:  కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌ల్లో దాదాపు 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 78 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. రైల్వేలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం మంత్రిత్వ శాఖల్లో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయ‌న పై వివ‌రాలు వెల్ల‌డించారు. 

దేశవ్యాప్తంగా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో కొత్త నియామకాలు జరుగుతున్నాయని జితేంద్ర సింగ్ తెలిపారు. "... ఇది (రోజ్గార్ మేళా) మరింత ఉపాధి-స్వయం ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనీ, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో 1 మిలియన్ యువతకు లాభదాయకమైన సేవా అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నాము" అని జితేంద్ర సింగ్ చెప్పారు.

నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశామనీ, ఉత్తమ విధానాలను అవలంబించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో నియామక వ్యవస్థపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని, రోజ్గార్ మేళాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వార్షిక నివేదికలోని ఖాళీల డేటాను ఉటంకిస్తూ మంత్రి జితేంద్ర సింగ్  రాజ్యసభకు తెలిపారు. 

రాజ్యసభలో ఆప్ ఎంపీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పంచుకున్న సమాచారం ప్రకారం, భారతీయ రైల్వే (ఐఆర్) దాని వివిధ విభాగాల్లో ఇప్పటికీ అత్యధికంగా 2,93,943 పోస్టులు ఖాళీగా ఉండగా, రక్షణ (సివిల్) రెండవ స్థానంలో 2,64,706 పోస్టులు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వానికి చెందిన 78 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పబ్లిక్ అండర్ టేకింగ్ విభాగాల్లో మొత్తం 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల్లో 1,43,536 పోస్టులతో మూడో స్థానంలో నిలవగా, తపాలా శాఖలో 90050 పోస్టులు, రెవెన్యూ శాఖలో 80243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో 25,934 పోస్టులు, అటామిక్ ఎనర్జీ విభాగంలో 9,460 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటామిక్ ఎనర్జీ విభాగం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 8,543 పోస్టులు, గనుల శాఖలో 7,063 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖలో 6,860 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రపతి సెక్రటేరియట్ లో 91 పోస్టులు, ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ లో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)లో 657 పోస్టులు, స్పేస్ సెక్టార్లో 2106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లలో ఇంకా 2535 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios