Asianet News TeluguAsianet News Telugu

80 శాతం ముస్లింలు ఓబీసీ కోటాను అనుభవిస్తున్నారు - రాందాస్ అథవాలే

ముస్లిం సమాజంలో 80 శాతం ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందినవారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రజాసంఘాల చిరకాల డిమాండ్ ను గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. 

80 percent Muslims enjoy OBC quota - Ramdas Athawale
Author
First Published Oct 10, 2022, 1:27 PM IST

దళిత మతమార్పిడులకు సంబంధించి షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిషన్‌ను నియ‌మించ‌డంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఖండించారు. కమిషన్ తన నివేదికను సమర్పించే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని  పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న ఓ వార్తా ప‌త్రిక‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం సమాజంలో 80 శాతం ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందినవారని, వారు మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రిజర్వేషన్లు పొందుతున్నారని చెప్పారు.

కడుపులో ఐదేళ్ల నుంచి కత్తెర.. డెలివరీ చేసిన వైద్యుల నిర్లక్ష్యం.. మళ్లీ అదే హాస్పిటల్‌కు బాధితురాలు

తాజా క‌మిష‌న్ ఏర్పాటుపై వ‌స్తున్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాసంఘాల చిరకాల డిమాండ్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగీకరించాయ‌ని, కానీ కాలయాపన చేశాయన్నారు. ‘‘ ప్రజాసంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ఆ పార్టీ చాలా ఏళ్లు అధికారంలో ఉండగా ప్రధాని మోడీ అధికారంలోకి వ‌చ్చి ఎనిమిదేళ్లు మాత్రమే అవుతోంది. అయితే ఇప్పుడు వారే (కాంగ్రెస్) ముస్లింలు,  క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు” అని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళిత హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తాయని అథవాలే తెలిపారు. అయితే 80 శాతం మంది ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ఉన్నారని, వారికి మండల్ కమిషన్ రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. “మండల్ కమిషన్ జాబితాలో అనేక ముస్లిం కులాలు ఉన్నాయి. వారు ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్నారు. మండల్‌లో ఓబీసీ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాం ’’ అని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ కు చుక్కలు చూపిన నేతలు: ఎన్టీఆర్ తో ములాయం అనుబంధం ఇదీ...

దళిత హిందువులకు 1950లో ఎస్సీ హోదా ఇవ్వగా, 1956లో సిక్కులకు భద్రత కల్పించారని, 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించిందని అథవాలే అన్నారు. ఈ విషయమై గత ప్రభుత్వాలు అనేక కమిటీలు వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలు సంఘాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మతమార్పిడులు పొందిన వారిరికి ఎస్సీ హోదా ఇవ్వడానికి అనుకూలంగా రెండు కమిటీలు నివేదికలు సమర్పించినప్పటికీ, దానిని పార్లమెంటు ఆమోదించలేదని మంత్రి చెప్పారు. అయితే ఇంతకుముందు కమిషన్లు ఈ విషయంలో స్పష్టమైన సిఫార్సులేవీ ఇవ్వలేదని ఆయ‌న పేర్కొన్నారు. “దాని వల్ల ఎలాంటి సవరణలు జరగలేదు. ఇప్పుడు కొత్త కమిటీ దాని చుట్టూ తిరుగుతున్న సమస్యలను పరిశీలిస్తుంది. నివేదిక రాగానే ప్రభుత్వం సమీక్షిస్తుంది ’’ అని చెప్పారు.

కాంగ్రెస్ కు చుక్కలు చూపిన నేతలు: ఎన్టీఆర్ తో ములాయం అనుబంధం ఇదీ...

కాగా.. కేంద్రం తాజాగా నియ‌మించిన క‌మిష‌న్ కు మాజీ సీజేఐ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వం వహిస్తారు. మరో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రవీంద్ర జైన్‌, యూజీసీ సభ్యురాలు సుష్మా యాదవ్ లు స‌భ్యులుగా ఉంటార‌ని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.  రెండేళ్లలో కమిషన్ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios