Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ యూనిఫాం కోసం... కోర్టుకి నాలుగోతరగతి బాలుడు

నిజానికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఒక్క జతే ఇచ్చింది. దీంతో మంజునాథ్‌ యూనిఫామ్‌ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్‌ చెప్పాడు

8 years old boy's PIL Forces Karntaka govt to issue 2nd set of uniform
Author
Hyderabad, First Published Aug 31, 2019, 2:19 PM IST

యూనిఫాం కోసం... ఓ నాలుగో తరగతి బాలుడు కోర్టును ఆశ్రయించాడు. పేదరికంలో మగ్గిపోతున్న తన లాంటి మరికొందరు విద్యార్థుల కోసం ఓ చిన్నారి చేసిన పోరాటం ఇది. అంతేకాదు... రాష్ట్ర ప్రభుత్వం కళ్లు కూడా తెరిపించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్‌ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. యూనిఫాం వేసుకుందామని చూస్తే... ఒకటి మురికిగా ఉంది. గతేడాది ఇచ్చిన షర్ట్ వేసుకుందామని చూస్తే... అది చినిగి పోయింది. దీంతో.. ఏం చేయాలో ఆ చిన్నారికి తోచలేదు.

నిజానికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఒక్క జతే ఇచ్చింది. దీంతో మంజునాథ్‌ యూనిఫామ్‌ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్‌ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్‌ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్‌ ఈ ఏడాది మార్చి 25న రిట్‌ వేశాడు. 

విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ మహమ్మద్‌ నవాజ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్‌టీఈ (రైట్‌ టు ఎడ్యుకేషన్‌) యాక్ట్‌ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios